ప్రభుత్వ అధికారికి ఎస్పీ నేత వార్నింగ్: ట్రాన్స్‌ఫర్ చేసేస్తా జాగ్రత్త!

Subscribe to Oneindia Telugu

లక్నో: ఎస్పీ(సమాజ్ వాదీ పార్టీ)నేత ఆజంఖాన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ప్రభుత్వాధికారితో వాగ్వాదానికి దిగి తన నోటి దరుసును బయటపెట్టుకున్నారు. ఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకునేందుకు రాయ్‌పూర్ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి.. ఓ అధికారితో ఆయన వాగ్వాదానికి దిగారు.

బయట రోడ్లు బాగాలేవంటూ సదరు అధికారిపై అజంఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఈ కార్యాలయానికి వచ్చే రోడ్లు అంతా మట్టికొట్టుకుపోయి ఉన్నాయి.. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి రోడ్లపై నేను ప్రయాణించాలా?' అంటూ అధికారిపై అజంఖాన్ మండిపడ్డారు.

SP leader Azam Khan blasts at SDM, asks ‘Is this why we picked you from rags?

పైగా, రాష్ట్రంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదన్న సంగతిని అజంఖాన్ అధికారికి గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా మంత్రిగా తనకు అధికారాలున్నాయని, అవసరమైతే నీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సదరు అధికారిని అజంఖాన్ హెచ్చరించారు. తలుచుకుంటే నిన్ను ఈ క్షణంలో వేరే ప్రాంతానికి బదిలీ చేస్తానంటూ ఫైర్ అయ్యారు.

అధికారిపై అజంఖాన్ మండిపడ్డ సమయంలో పలువురు మీడియా ప్రతినిధులు అక్కడే ఉన్నారు. దీంతో ఈ తతంగాన్ని వారు తమ కెమెరాల్లో బంధించడంతో విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుండగా.. గతంలోను వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన వార్తల్లో నిలిచారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Days after his party was defeated in the Uttar Pradesh Assembly elections, a video featuring Samajwadi Party leader Azam Khan surfaced on the internet where the Rampur MLA can be seen lashing out against a sub-divisional magistrate according to news agency ANI
Please Wait while comments are loading...