వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదరుడి మృతి: 767 రోజులుగా యువకుడి ఆందోళన, సినీ నటుల మద్దతు

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: తన సోదరుడి మృతి కేసులో నెలకొన్న అనుమానాలను తీర్చేందుకు వీలుగా సిబిఐ దర్యాప్తు చేయించాలని శ్రీజిత్ 767 రోజులుగా కేరళ సెక్రటేరియట్ ఎదుట మౌన దీక్ష చేస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ భాదిత కుటుంబంతో సోమవారం నాడు చర్చించారు. అయితే ఈ ఘటనపై సిబిఐ విచారణ చేయిస్తామని ప్రకటన వచ్చే వరకు తన ఆందోళన కొనసాగిస్తామని శ్రీజిత్ ప్రకటించారు.

767 రోజులుగా కేరళ సెక్రటేరియట్ ఎదుట శ్రీజిత్ చేస్తున్న పోరాటం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తన సోదరుడు శ్రీజీవ్ అనుమానాస్పదస్థితిలో మరణించాడని శ్రీజిత్ ఆరోపిస్తున్నారు.

తన సోదరుడి మృతిపై అనేక అనుమానాలున్నాయని శ్రీజిత్ అభిప్రాయపడుతున్నారు. ఓ అధికారి కూతురిని ప్రేమించిన కారణంగానే తన సోదరుడిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రీజిత్ ఆరోపణలు చేస్తున్నాడు.

767 రోజులుగా కేరళలో యువకుడి ఆందోళన

767 రోజులుగా కేరళలో యువకుడి ఆందోళన

తన సోదరుడి మరణానికి సంబందించిన వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేస్తూ శ్రీజిత్ అనే యువకుడు 767 రోజులుగా కేరళ సెక్రటేరియట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నాడు. 2014 మే మాసంలో శ్రీజీవ్ దొంగతనం కేసులో అరెస్టయ్యాడు. పోలీసుల కస్టడిలోనే శ్రీజీవ్ విషం తాగి మరణించాడు. అయిత ఈ మరణంపై అనుమానాలున్నాయని శ్రీజిత్ ఆందోళనకు దిగాడు. సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాడు.కేరళ సెక్రటేరియట్ ఎదుటే బాధితుడు ఆందోళన చేస్తున్నాడు.

ఆత్మహత్యగా చిత్రీకరించారు.

ఆత్మహత్యగా చిత్రీకరించారు.


కేరళలో శ్రీజీవ్ మరణం చర్చనీయాంశంగా చేశారు శ్రీజిత్. తన సోదరుడు ఓ అధికారి కూతురును ప్రేమించాడని శ్రీజిత్ చెబుతున్నాడు. అయితే అది ఇష్టం లేకపోవడంతో పోలీసులే తన సోదరుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రీజీవ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు స్టే తెచ్చుకొన్నారని శ్రీజీత్ చెబుతున్నారు. తన సోదరుడి మృతి విషయమై సిబిఐ విచారణ చేయించాలని శ్రీజీత్ ఆందోళన చేస్తున్నారు.

పురోగతి లేని కేసు దర్యాప్తు

పురోగతి లేని కేసు దర్యాప్తు

అంతకుముందున్న ప్రభుత్వం మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహరంతో పాటు దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయిస్తామని హమీ ఇచ్చింది. అయితే దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో శ్రీజిత్ ఆందోళన కొనసాగిస్తున్నాడు.సిబిఐ విచారణ చేయించాలని ఆయన పట్టుబడుతున్నాడు.

శ్రీజిత్‌కు సినీ నటుల మద్దతు

శ్రీజిత్‌కు సినీ నటుల మద్దతు

సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేస్తున్న శ్రీజిత్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ బ్లాగ్‌లో రాశారు. ఇది వైరల్ ‌గా మారింది. దీంతో పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు శ్రీజిత్‌కు మద్దతు ప్రకటించారు.నటులు పృథ్వీరాజ్‌, నివిన్‌ పౌలీ‌, టొవినో థామస్‌లు శ్రీజిత్‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులు శశిథరూర్‌, కేసీ వేణుగోపాల్‌ లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మరో మంత్రి జితేంద్ర సింగ్‌లను కలిసి సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సోమవారం నాడు కేరళ ముఖ్యమంత్రి విజయన్ ‌తో శ్రీజిత్ సమావేశమయ్యారు.

English summary
The 29-year-old has been on an indefinite agitation outside the state secretariat seeking a CBI probe into the alleged custodial death of his younger brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X