హిజ్రాగా మారనున్న స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో టాలెంట్, అంతకు మించిన అదృష్టం కూడా ఉండాలి. అదే స్టార్ హీరోల పిల్లలు అయితే ఎంట్రీ కొంత ఈజీగానే ఉంటుంది. ఎంట్రీ ఇవ్వడానికి వారసత్త్వం పనికొచ్చినా నిలదొక్కు కోవాలంటే మాత్రం టన్నుల కొద్దీ టాలెంట్ ఉండాల్సిందే.
ఇందు కోసం ఎన్నో రకాల ప్రయోగాలు, ఫీట్లు చేయాల్సి ఉంటుంది. తాజాగా బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో కొడుకు చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు అయిన జునైద్ ఖాన్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న విషయం తెల్సిందే. అమీర్ ఖాన్, అతడి మాజీ భార్య రీనా దత్తాల కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇందుకోసమే ప్రస్తుతం జునైద్ థియేటర్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటూనే.. మరో పక్క నాటకాల్లో ఆరితేరుతున్నాడు. ఇక తాజాగా ఒక నాటకం కోసం ఆసక్తికరమైన పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. అదే హిజ్రా పాత్ర. స్ట్రిక్ట్‌లీ అన్‌కన్వెన్షనల్ అనే నాటకంలో జునైద్ ఖాన్ హిజ్రా పాత్రలో కనిపించబోతున్నాడట.
ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముంబై లోని పృథ్వీ థియేటర్‌లో జునైద్ తన తొలి ప్రదర్శనకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే పలు నాటకాలలో స్టేజి అనుభవం ఉన్న ఈ స్టార్ హీరో కొడుకు ఇప్పుడు ఇలాంటి నాటకంతో రెడీ అవుతుండడంతో అభిమానులు దీనికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు హిజ్రా పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అని తెలియడంతో ఎలా నటిస్తాడా ? అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నాటకం కనుక హిట్ అయితే.. జునైద్ కు ఇక ఇండస్ట్రీ లో మంచి మంచి అవకాశాలు వస్తాయని సినీ విశ్లేషకులు చెప్తున్న మాట. మరి ఈ స్టార్ హీరో కొడుకు నటనలో తండ్రిని మించి పోతాడా, ఏ మేరకు రాణిస్తాడో అనే విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.












Click it and Unblock the Notifications