వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీపికబురు: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్బీఐ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచిన ఎస్బీఐ

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీరేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5-10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జులై 30వ తేదీ నుంచి అమలవుతాయి.

వివిధ కాలపరిమితులతో సాధారణ, వయో వృద్ధులు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో చేసిన మార్పులను ఎస్బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏడాది నుంచి పదేళ్ల కాలపరిమితికి రూ.కోటి కంటే తక్కువ చేసిన డిపాజిట్లపై వడ్డీని 5-10 బేసిస్ పాయింట్ల మధ్య పెంచింది. అంటే 0.05శాతం నుంచి 0.1శాతం పెరుగుతుంది.

State Bank of India hikes FD interest rates, applicable from today

సాధారణ ప్రజలకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితి చేసిన డిపాజిట్లపై గతంలో వడ్డరేటు 6.65శాతం ఉండగా, ఇప్పుడు 6.7శాతానికి పెరిగింది. రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి 6.75శాతం నుంచి 6.75శాతానికి పెరిగింది.

కాగా, సీనియర్‌ సిటిజన్లకు ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి చేసిన డిపాజిట్లపై వడ్డీ రేటు 7.15శాతం నుంచి 7.2శాతానికి పెరిగింది. ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలపరిమితికి 7.25శాతం నుంచి 7.35శాతానికి పెరిగింది. ఎస్‌బీఐ ఉద్యోగులకు, ఎస్‌బీఐ పెన్షనర్లకు ఎస్‌బీఐ ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా చేసే, రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని పేర్కొంది.

English summary
The State Bank of India on Monday revised its Fixed Deposit (FD) interest rates hiking it by 5 basis points to 10 basis points, thus raising it from 0.05 per cent to 0.1 per cent. The new rates will be applicable starting from July 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X