కాపీ కొట్టను.. కరుణించండి సార్, తప్పని డిబార్.. క్షణికావేశంలో విద్యార్థిని..
పరీక్ష అంటే చదివి రాయాలి.. కాపీ కొడితే డిబార్ చేస్తారు. మరొసారి పరీక్ష రాయరు. కొందరు తెలిసి మరీ అలా చేస్తారు. పట్టుబడతారు.. తర్వాత బతిమిలాడతారు. కానీ కొందరే ధైర్యం చేస్తారు. మరికొందరు మాత్రం ప్రాణాలను కూడా తీసుకుంటారు. బెంగళూరులో ఓ విద్యార్థిని చేసిన చిన్న తప్పు.. చివరకు ప్రాణాలను తీసుకుంది.తప్పు చేసి దొరికిపోవడంతో ''ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి'' అని వేడుకుంది. ఫలితం లేకపోవడంతో చివరకు తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయింది.
బెంగళూరు జీవనబీమా నగర్ ముళబాగిలుకు చెందిన భవ్య.. ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్ కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది. వాయిదాపడుతూ వచ్చిన పరీక్షలను గత వారం నిర్వహించారు. కాపీ స్లిప్పులను బయటికీ తీసిన భవ్య.. దొంగచాటుగా రాసింది. ఇన్విజిలేటర్లకు అనుమానం రావడంతో పరిశీలించగా దొరికిపోయింది.ఇదొక్కసారి వదిలేయండి సార్.. ఇంకోసారి ఇలా చేయను సార్ అని వేడుకుంది. పట్టించుకోకుండా యువతిని డిబార్ చేశారు.

తీవ్ర మానసిక ఒత్తిడికి గురైర భవ్య.. హాస్టల్‌కు వెళ్లి ఇంటికి ఫోన్ చేసింది. కాపీ కొడుతూ దొరికిపోవడంతో డిబార్ చేశారు.. ఎంతో అవమానంగా ఉంది, బతకాలని లేదని చెప్పి ఫోన్ పెట్టేసింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు.. తిరిగి ఆమెకు ఫోన్ చేస్తే స్విచ్చాప్ అని వచ్చింది. యువతి ఉంటున్న హాస్టల్‌కు వచ్చేశారు. ఫోన్ పెట్టేసిన యువతి.. వెంటనే హాస్టల్ ఐదవ అంతస్తు పైనుంచి దూకేసింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న భవ్యను చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Recommended Video
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications