ఇంగ్లీష్ రావట్లేదని ఇంత ఘోరమా..!

Subscribe to Oneindia Telugu

తిరువాన్నమలై : చదువు రాలేదనో.. పని చేతనవట్లోదనో.. ప్రాణాలే తీసుకోవాలనుకోవడం దారుణం. తమిళనాడులోని తిరువాన్నమలై గ్రామానికి చెందిన ఓ పదో తరగతి బాలిక.. సబ్జెక్టు రావట్లేదని జీవితాన్నే పణంగా పెట్టింది. కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టులో వెనుకబడ్డానన్న ఒక చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంది.

తమిళనాడులోని తిరువాన్నమలై పట్టణంలో ఉండే కష్టవలి, పుంగోడి దంపతులకు భవాని అనే కూతురుంది. స్థానికి మున్సిపల్ హైస్కూల్ లో పదో తరగతి చదివుతోంది భవాని. అయితే ఇంగ్లీష్ లో మార్కులు తక్కువగా వస్తుండడంతో భవాని తీవ్రంగా బాధపడుతుండేది. ఇంగ్లీష్ లో వెనుకబడ్డానన్న న్యూనత భావం ఆమెను వెంటాడింది.

Student Sucide for getting least marks in english

ఎంత కష్టపడ్డ ఇంగ్లీష్ సబ్జెక్టులో పట్టు సాధించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో అసలు పాఠశాలకు కూడా వెళ్లబుద్ది కావడం లేదని తన తోబుట్టువులతో వాపోయిందట. ఇదే క్రమంలో గత సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న భవాని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A student was sucided for getting least marks in english. the incident was taken place in tamilnadu tiruvannamalai

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి