7 పార్టీలు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది: నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్
బీహర్‌లో జేడీయూ- ఆర్జేడీ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని నితీశ్ కుమార్ అంటున్నారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నితీశ్‌తోపాటు తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఏడు పార్టీలు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే తమకు మద్దతు ఇస్తున్నారని నితీశ్ కుమార్ వివరించారు. వారంతా పేపర్‌పై సంతకం చేశారని తెలిపారు.
బీహర్‌లో రాజకీయ చదరంగంపై జేడీయూ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన ఆర్సీపీ సింగ్ విమర్శలు చేశారు. బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకోవడం వెనక గల కారణం ఏంటీ అని అడిగారు. 2020 తీర్పును తేజస్వీ యాదవ్ ఉల్లంఘించారని మండిపడ్డారు. నితీశ్ వైఖరి నచ్చక ఇటీవల ఆయన పార్టీ వీడిన సంగతి తెలిసిందే.
Recommended Video


గవర్నర్‌ను కలిసిన తర్వాత తేజస్వి యాదవ్ కూడా మీడియాతో మాట్లాడారు. దేశంలో అనుభవం ఉన్న ముఖ్యమంత్రుల్లో నితీశ్ కుమార్ ఒకరని అన్నారు. కానీ బీజేపీ మాత్రం సంకీర్ణ ధర్మాన్ని తుంగలో తొక్కిందని కామెంట్ చేశారు. బీజేపీ చేసిన తప్పులను పంజాబ్, మహారాష్ట్రలో చూశాం అని తెలిపారు. ప్రాంతీయ పార్టీల పని అయిపోయిందని జేపీ నడ్డా అంటున్నారు.. కానీ ఇక్కడ మాత్రం వారికే ప్రాంతీయ పార్టీలే మిన్నా అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications