అండర్ ట్రయల్ ఖైదీలకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్-జైళ్లకు కీలక ఆదేశాలు..!
దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలతో పాటు తొలిసారి జైలుకెళ్లిన వారికీ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని త్వరిత గతిన విడుడల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరిండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన క్రిమినల్ న్యాయ చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం వీరిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
విచారణ ఖైదీలు తమ జైలు శిక్షలో మూడింట ఓ వంతు పూర్తి చేసుకుంటే వీరిని విడుదల చేసేందుకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత లోని సెక్షన్ 479 ప్రకారం చర్యల్ని వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు జైలు సూపరింటెండెంట్ లకు ఆదేశాలు జారీ చేసింది. జైళ్ల రద్దీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా ఖైదీలకు ఊరట దగ్గబోతోంది.

సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల సూపరింటెండెంట్‌లను మూడు నెలల్లోగా వీరి దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదని సుప్రీంకోర్టు తెలిపింది.
దీంతో ఇప్పుడు జైళ్లలో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారు బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాసెస్ చేసుకునేందుకు వీలు కలిగినట్లయింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications