Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈవీఎంల స్ధానంలో పేపర్ బ్యాలట్లతో ఎన్నికలు-సుప్రీం కీలక తీర్పు..!

దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు పలు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దేశంలో ఈవీఎంల ట్యాపరింగ్ జరుగుతోందని, ఫలితాలు కాస్త ఆలస్యమైనా పేపల్ బ్యాలెట్ల వాడకమే మిన్న అన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇదే అంశంపై దాఖలైన ఓ పిటిషన్ పై కీలక తీర్పు వెలువరించింది.

దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌కు తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పు ఇచ్చింది. మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) ట్యాంపరింగ్ జరగవని, ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు జరుగుతాయా అని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీబీ వరాలే తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది.

supreme court rejects plea requests return to paper ballots ask evms not tampered when you win

ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం ఐదేళ్లపాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషనర్ కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది. మూడు లక్షల మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కేఏ పాల్ ను ప్రశ్నించింది.

అలాంటి సేవా నేపథ్యం కలిగిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కేఏ పాల్ ను ప్రశ్నించింది. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని, ఏపీ సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని చెప్పారని పిటిషనర్ తెలిపారు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని అన్నారని, ఇప్పుడు జగన్ ఓడిపోయి అదే అంటున్నారని కేఏ పాల్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+