తీర్పుల్లో మహిళలపై ఈ పదాలు వాడొద్దు.. ! జడ్డీలకు సుప్రీంకోర్టు హెచ్చరిక..
న్యాయస్ధానాల్లో పలు కేసుల్లో న్యాయమూర్తులు ఇస్తున్న ఆదేశాలు, తీర్పుల్లో మహిళలపై అనుచిత పద ప్రయోగాలు దొర్లుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నియంత్రించేందుకు న్యాయమూర్తులకు ప్రత్యేక హ్యాండ్ బుక్ విడుదల చేసింది. ఇందులో జడ్డీలు తమ తీర్పుల్లో, ఆదేశాల్లో మహిళలను ఉద్దేశించి ఏయో పద ప్రయోగాలు చేయకూడదో సూచించింది. వీటిని న్యాయమూర్తులు తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశించారు.
చట్టపరమైన ప్రక్రియల్లో లింగపరమైన సున్నితత్వాన్ని పరిరక్షించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. లింగపరంగా మూస పద్ధతులతో నిండిన పదాలు, పదబంధాలను త్యజించేలా ఓ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. వాటిని కోర్టు ఆదేశాలలో ఉపయోగించకుండా న్యాయమూర్తులను హెచ్చరించింది. హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్' పేరుతో విడుదల చేసిన ఈ హ్యాండ్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గత కోర్టు తీర్పులలో మహిళలకు ఉపయోగించిన అనేక అభ్యంతరకరమైన పదాలను ఉదహరించారు.

ఈ పదాల వాడకం సరికాదని, కోర్టు తీర్పులలో మహిళలపై వీటిని వాడినట్లు సీజేఐ తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్ యొక్క ఉద్దేశ్యం ఆ తీర్పులను విమర్శించడం లేదా వాటిని అనుమానించడం కాదని, ఇది లింగ పరమైన మూస పద్ధతులు అనుకోకుండా ఎలా కొనసాగుతున్నాయో తెలియజెప్పడమే అన్నారు. ఈ మూస పద్ధతులను నిర్వచించి వారిలో అవగాహన కల్పించడమే హ్యాండ్‌బుక్ లక్ష్యం అని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు.
స్త్రీ ఇతరులతో సంబంధంలో ఉన్నప్పుడు ఆమెను 'ఉంపుడుగత్తె'గా సూచించే తీర్పుల్ని తాను చూసినట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. గృహ హింస చట్టం, ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడానికి దరఖాస్తులు ఉన్న తీర్పులలో స్త్రీలను 'కీప్‌లు' అని పిలుస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ హయాంలో లింగ మూస పద్ధతులను నిర్మూలించే హ్యాండ్‌బుక్ తీసుకురావడం సుప్రీంకోర్టు తీసుకున్న మరో కీలక నిర్ణయం. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పులు ప్రాంతీయ భాషల్లో అనువదించే నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని కూడా ప్రశంసించారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications