భద్రతకు ఇన్ఫోసిస్ 'స్వాతి' యాప్: స్మార్ట్ ఫోన్ లేకున్నా

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో ఇటీవల దారుణహత్యకు గురైన తమ సంస్థ ఉద్యోగిని స్వాతి పేరిట ఇన్ఫోసిస్‌ ఒక యాప్‌ రూపొందిస్తోంది. రైల్వే రక్షకదళం మహిళల రక్షణ కోసం ప్రత్యేకించి ఒక యాప్‌ను ఏర్పాటు చేయ సంకల్పించింది.

ఎందుకు చేశావ్: నిందితుడితో ఇన్ఫోసిస్ టెక్కీ తండ్రి, కోర్టుకు రామ్
దీనిని రూపొందించిన ఇన్ఫోసిస్‌.. తమ ఉద్యోగిని స్వాతి జ్ఞాపకార్థం ఆమె పేరు పెట్టింది. దీనిని వచ్చే నెలలో ఆవిష్కరించనున్నారు. స్వాతి యాప్ మహిళా ప్రయాణీకుల భద్రతకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్వాతి యాప్ ద్వారా ఎవరైనా సులభంగా పోలీసులకు సమాచారం అందించవచ్చు.

‘Swathi’ app to protect passengers

స్మార్ట్ ఫోన్ కాని ఫోన్లలో యాప్‌లు కుదరవు. అయినప్పటికీ ఎస్సెమ్మెస్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్ కాకుండా, సాధారణ ఫోన్లు వాడే వారికి కూడా అందుబాటులోకి రానుంది.

ఇన్ఫోసిస్ టెక్కీ హత్య: రామ్ కుమారే చంపేశాడు.. సాక్షి
సమాచారం మేరకు మంగళవారం నాడు సదర్న్ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కేకే అశ్రాఫ్ ఇన్ఫోసిస్ ప్రతినిధులను కలిశారు. ఈ యాప్ తుది రూపు దిద్దుకుంటోందని వారు చెప్పారని తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా వచ్చే సందేశాలకు స్పందించేందుకు ఆర్పీఎఫ్ టీంకు శిక్షణ ఇస్తామని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In what could be a fitting tribute to S. Swathi, the techie who was hacked to death in Nungambakkam railway station last month, the Railway Protection Force (RPF) will soon launch a mobile application in her name for the safety of women passengers. IT major Infosys, where Swathi worked last, has apparently agreed to develop the app that facilitates women to seek police assistance at the click of an ‘SOS’ button. The facility will also be extended to non-smart phone users via SMS.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి