Illegal affair: భార్యను ఎందుకు చంపానంటే ?, రివర్స్ స్టోరీతో షాక్, ఏమైపోతుంది ? !
చెన్నై/బెంగళూరు/హోసూరు: స్నేహితుడి ఇంట్లో జరగుతున్న శుభాకార్యానికి వెళ్లి కొన్ని రోజులు అతని ఇంట్లో భార్యతో కలిసి భర్త సంతోషంగానే ఉన్నాడు. స్నేహితుడి ఇంట్లోనే భార్య గొంతుకోసి చంపేసిన భర్త అర్దరాత్రి అంబులెన్స్ లో ఆమె శవాన్ని తీసుకుని ఆమె సొంతఊరికి వెళ్లిపోయాడు. మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త నాటకాలు ఆడి పరారైనారు. భార్య కుటుంబ సభ్యులు శవాన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో ఆ సంఘటన జరిగిన ఊరికి తీసుకుని వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. జీవిత భాగస్వామి అక్రమ సంబంధం కళ్లారా చూసినందు వలనే భర్త చేతిలో భార్య హత్యకు గురైయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నా భార్య నా అక్రమ సంబంధం విషయంలో చూసిచూడనట్లు ఉండుంటే ఈ రోజు ఆమె ప్రాణాలతో ఉండేదని, ఎదురుతిరిగింది, ఏసేశానని భర్త చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
Illegal affair: జాతకంతో పాటు ఆంటీకి అన్నీ చూసిన జ్యోతిష్యుడు, నడిరోడ్లో ఔట్!'

హ్యాపీలైఫ్.... ఫ్రెండ్ ఇంటికి దంపతులు
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని వేమ్ గల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్ కుమార్, కోలారుకు చెందిన శాంతా అనే యువతి మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు (బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దు)లోని కార్పోరేషన్ సమీపంలోని లైమ్ స్ట్రీట్ లో ప్రవీణ్ కుమార్ క్లోజ్ ఫ్రెండ్ వెంకట్ (పేరు మార్చడం జరిగింది) నివాసం ఉంటున్నాడు. వారం రోజుల క్రితం ప్రవీణ్ కుమార్, శాంతా దంపతులు హోసూరులోని వెంకట్ ఇంటికి వెళ్లారు.

రాత్రి రూమ్ లో భార్యను ఎలా చంపాడంటే ?
మూడు రోజు క్రితం శుభకార్యంలో భార్య శాంతాతో సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుమార్ బుధవారం రాత్రి ఏదో తేడా జరుగుతోందని అనుమానం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుడు వెంకట్ ఇంట్లోని ఓ గదిలో ప్రవీణ కుమార్, శాంతా దంపతులు గొడవపడ్డారు. రాత్రి గదిలో శాంతా గొంతుకోసి చంపేసిన ప్రవీణ్ కుమార్ రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు.

వీడి స్కెచ్ మామూలుగా లేదు
తన భార్య శాంతాకు అనారోగ్యంగా ఉందని ప్రవీణ్ కుమార్ అతని ఫ్రెండ్ వెంకట్ కుటుంబ సభ్యులను నమ్మించి వెంటనే అక్కడికి అంబులెన్స్ పిలిపించాడు. తాను బెంగళూరు వెళ్లి తన భార్యకు చికిత్స చేయిస్తానని ప్రవీణ్ కుమార్ వారిని నమ్మించి భార్య శాంతా శవాన్ని అంబులెన్స్ తీసుకుని హోసూరు నుంచి బయటకు వచ్చేసి బెంగళూరుకు వెళ్లకుండా కోలారులోని శాంతా ఇంటి దగ్గరకు అంబులెన్స్ తీసుకెళ్లాడు.

నా చెయ్యిదాటిపోయింది
మీ కుమార్తె నాతో గొడవపడిందని, తాను బయటకు వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అక్కడి నుంచి పరారైనాడు. శాంతా గొంతు కింద గాయాలు కావడం, గొంతు తెగిపోయి ఉండటంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అదే అంబులెన్స్ లో శాంతా శవాన్ని హోసూరు తీసుకెళ్లి పోలీసు కేసు పెట్టారు. పోస్టుమార్టుంలో శాంతా హత్యకు గురైయ్యిందని వెలుగు చూసింది.

భార్య కాదు.... ఇది భర్త అక్రమ సంబంధం
పోలీసులు ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ కుమార్ కు పోలీసులు ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ సమయంలో శాంతాను ఎందుకు చంపాను అనే విషయంలో ప్రవీణ్ కుమార్ మొత్తం క్లారిటీ ఇచ్చాడు. తాను వేరే మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్నానని ప్రవీణ్ కుమార్ పోలీసులకు చెప్పాడు.

చూసిచూడనట్లు ఉండాలి... లేదంటే ఇంతే
తాను వేరే మహిళతో అడ్డంగా బెడ్ రూమ్ లో తన భార్యకు చిక్కిపోయాయని, ఆ రోజు నుంచి గొడవలు ఎక్కువ అయ్యాయని పోలీసులు అన్నారు. ఆ రోజు రాత్రి అదే విషయంలో గొడవ జరగడంతో తాను సహనం కోల్పోయి తన భార్య శాంతాను హత్య చేశానని ప్రవీణ్ కుమార్ అంగీకరించాడని హోసూరు పోలీసులు తెలిపారు. నా భార్య నా అక్రమ సంబంధం విషయంలో చూసిచూడనట్లు ఉండుంటే ఈ రోజు ఆమె ప్రాణాలతో ఉండేదని, ఎదురుతిరిగింది, ఏసేశానని భర్త చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications