క్యాంపస్ లోకి లాక్కెళ్ళి విద్యార్థినిపై లైంగిక దాడి, వీడియోలు..పోలీసులు అక్కడే ఉన్నా యూపీలో దారుణం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్ లో సామూహిక హత్యాచార ఘటన మరిచిపోకముందే బాలికలపై ,మహిళలపై పలు రాష్ట్రాలలో లైంగిక దాడులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా యూపీలోని ఝాన్సీలో పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ సర్వీసు పరీక్షలు జరుగుతున్నా, కూతవేటు దూరంలో పోలీసు భద్రత ఉన్నప్పటికీ అదే కాంపస్ లో 17 ఏళ్ల యువతిపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది.

సివిల్ సర్వీస్ పరీక్షలు జరుగుతుండగా .. క్యాంపస్ లోనే రేప్
యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటుగా, అభ్యంతరకరమైన వీడియోలను తీసి హింసకు గురి చేశారు కొందరు కామాంధులు. కళాశాలలోనే వెలుగు చూసిన ఈ దారుణం యూపీలో సంచలనంగా మారింది. అక్టోబర్ 11వ తేదీన ఆదివారం పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ సర్వీస్ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసుల భారీ భద్రత కూడా ఉంది. ఈ సమయంలో ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళుతుండగా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు బలవంతంగా ఆమెను క్యాంపస్ లోపలికి లాక్కెళ్ళి దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

హాస్టల్ లోకి లాక్కెళ్ళి అత్యాచారం .. వీడియో తీసిన యువకులు
తనతో పాటు ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ను కొట్టి తనను బలవంతంగా హాస్టల్ లోపలికి లాక్కెళ్లారు అని, అక్కడ ఒక యువకుడు తనపై అత్యాచారం చేశాడని, మిగతా వారంతా దానిని వీడియో తీశారని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు నిందితులు బాలిక నుండి రెండు వేల రూపాయలు లాక్కున్నారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
భారీగా పోలీసుల రక్షణ మధ్య ప్రోవెన్షియల్ సివిల్ సర్వీసు పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఈ దారుణం జరిగినట్లుగా తెలుస్తుంది.

కేకులు విన్న పరీక్షల భద్రత చూస్తున్న పోలీసులు.. కేసు నమోదు
కళాశాల క్యాంపస్ సమీపంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాలిక కేకలు విని , అక్కడికి వెళ్లడంతోఈ విషయం బయటపడింది. నిందితుల్లో ఒకరిని భరత్ అనే వ్యక్తి గా గుర్తించామని, నిందితులంతా పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు హాస్టల్ లో ఉండేవారా ? కాదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామని, వారిపై ఐపీసీ సెక్షన్ 120 బి , 376 డి , 395, 386, 323, సెక్షన్ 66 డి ఐటీ చట్టం క్రింద, పోక్సో చట్టం లోని సెక్షన్ 3/4 క్రింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications