వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ ఉగ్రదాడి: గతంలో జరిగిన దాడుల వివరాలిలా..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రశాంతంగా ఉన్న పంజాబ్‌లో సోమవారం జరిగిన ఉగ్రదాడి అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన గురుదాస్‌పూర్‌లో పోలీసు స్టేషన్‌పై, బస్సుపై ఉగ్రవాదులు సోమవారం ఉదయం 5.45 గంటలకు దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈరోజు ఉదయం సైనిక దుస్తులు ధరించిన సుమారు నలుగురు ఉగ్రవాదులు మొదట ఓ బస్సుపై కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై కాల్పులు జరిపారు. ఉదయం నుంచి కొనసాగుతోన్న ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 13 మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే పంజాబ్‌లో ఉగ్రవాద దాడులు కొత్తేమీ కాదు. 1980, 1990 సంవత్సరాల కాలంలో ఖలిస్థాన్‌ వేర్పాటువాద పోరాట సమయంలో ఉగ్రవాదుల దాడులు జరిగాయి. అయితే గత పదేళ్లుగా పంజాబ్ కాస్త ప్రశాంతంగా ఉంది. గత పదేళ్లలో ఇదే అతి పెద్ద ఉగ్రదాడి.

Terrorist attack in Punjab Gurdaspur district: Previous terrorist attacks

గతంలో పంజాబ్‌లో జరిగిన ఉగ్రదాడుల వివరాలిలా ఉన్నాయి:

* 1993 (జనవరి 6): గురుదాస్‌పూర్‌లోని చిన్నేర్‌వాలా ప్రాంతంలో 11 మంది ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.
* 1991 (జూన్‌ 15): లూథియానాలో 80 మంది బస్సు ప్రయాణికులను విచక్షణారహితంగా కాల్చి చంపారు.
* 1990 (నవంబరు): అలివాలా ప్రాంతంలో బ్యాంకు దోపిడీ ఘటనలో సెక్యూరిటీ గార్డును చంపేశారు.
* 1990 (మార్చి 7): అబోహర్‌‌లో ఓ రద్దీగా ఉండే బజారులో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 32 మంది చనిపోయారు.
* 1989 (జూన్‌ 25): మోగా ప్రాంతంలో ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు 27 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవక్‌లను విచక్షణారహితంగా కాల్చి చంపారు.
* 1988 (మే 15): పాటియాలా, సామనా ప్రాంతాల్లో ఉగ్రవాద దాడుల్లో 40 మంది చనిపోయారు.
* 1988 (ఏప్రిల్‌ 2): రాంగాం ప్రాంతంలో జరిగిన వివిధ దాడుల్లో 24 మంది మృతిచెందారు.
* 1988 (మార్చి 31): రాజ్‌బా ప్రాంతంలో 18 మందిని కాల్చి చంపారు.
*1988 (మార్చి 3): కహ్రి సహ్రి ప్రాంతంలో ఓ వేడుకలో ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా 35 మంది చనిపోయారు.
* 1988 (ఫిబ్రవరి): గురుదాస్‌పూర్‌, హోషియాపూర్‌, పాటియాలా ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో 120 మంది చనిపోయారు.
* 1987 (ఆగస్టు): జగదేవ్‌ కలన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు 13 మందిని కాల్చి చంపారు.
* 1987 (జులై): లల్రు ప్రాంతంలో హర్యానా రవాణాసంస్థకు చెందిన మూడు బస్సులపై ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో 80 మంది మృతిచెందారు.
* 1986 (నవంబరు 30): కుడ్డా ప్రాంతంలో 24 మంది బస్సు ప్రయాణికులను కాల్చి చంపారు.
* 1986 (అక్టోబరు 31): లూథియానాలోని దాబా రోడ్డులో 8 మందిని కాల్చి చంపారు.
* 1986 (మార్చి 29): జలంధర్‌లోని మలియన్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో 20 మంది చనిపోయారు.
* 1986 (మార్చి 28): లుధియానాలోని ద్రేసి మైదానంలో ఉగ్రవాదులు జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో 13 మంది చనిపోయారు.
* 1986 (మార్చి 6): కపుర్తలా ప్రాంతంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పుల్లో 15 మంది చనిపోయారు.

English summary
The Jammu-Pathankot highway is dotted with several army cantonments and stations and the population along the road is predominantly Hindu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X