ప్రియురాలితో మస్త్ మజా చేస్తున్న టైమ్ లో ఇనుప రాడ్ తో భర్త ఎంట్రీ, ఓనర్ !
తిరువనంతపురం/కొచ్చి: సొంతంగా ఫేమస్ నాన్ వెజ్ హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. హొటల్ లో చాలా మంది పని చేస్తున్నారు. హోటల్ లో పని చేస్తున్న వివాహిత మహిళతో హోటల్ యజమాని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రతిరోజు హోటల్ లో పని చెయ్యడానికి వస్తున్న మహిళతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.
కేరళలోని మల్లప్పురం జిల్లాలోని తిరూర్ పట్టణంలో సిద్దక్ (58) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కేరళలోని కోజికోడ్ లోని ఎలాతిపాల్యం ఏరియాలో సిద్దిక్ సొంతంగా నాన్ వెజ్ హోటల్ పెట్టుకున్నాడు. మంచి వ్యాపారం చేస్తున్న సిద్దిక్ డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడ. సిద్దిక్ హోటల్ లో చాలా మంది పని చేస్తున్నారు.

సిద్దిక్ హోటల్ లో సిబిల్ (36) అనే వ్యక్తి, పర్హానా (34) అనే మహిళ పని చేస్తున్నారు. ఇద్దరూ దంపతులు. సిబిల్ భార్య చూడటానికి ఎర్రగా, బుర్రగా ఉండటంతో ఆమెను హోటల్ యజమాని సిద్దిక్ లైన్ లో పెట్టాడు. జీతం ఇస్తున్న యజమాని మోజు పడటంతో పర్హానా కూడా అతనికి లొంగిపోయింది. జీతంతో పాటు పర్హానాతో ఎంజాయ్ చేస్తున్న సిద్దిక్ ఆమెకు ఎప్పుడుపడితే అప్పుడు అడిగినంత డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు.
భర్త సిబిల్ కు తెలీకుండా పర్హానా హోటల్ యజమాని సిద్దిక్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. భార్య అక్రమ సంబంధం మ్యాటర్ సిబిల్ కు తెలిసిపోయింది. హోటల్ యజమాని సిద్దిక్ ను హత్య చేసి అతని దగ్గర ఉన్న బంగారు, డబ్బులు దోచుకోవాలని సిబిల్, పర్హానా దంపతులు స్కెచ్ వేశారు. రాత్రి భార్య పర్హానాతో ఎంజాయ్ చేస్తున్న హోటల్ యజమాని సిద్దిక్ తల మీద ఇనుపరాడ్ తో కొట్టిన సిబిల్ అతన్ని హత్య చేశాడు.
హోటల్ యజమాని సిద్దిక్ ను హత్య చేసిన తరువాత అతని శవాన్ని సూట్ కేసులో పెట్టి పాలక్కాడ్ సమీపంలోని అట్టప్పాడి అటవి ప్రాంతంలో పడేశారు. కొన్ని రోజుల తరువాత సూట్ కేసు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సూట్ కేస్ పరిశీలించగా అందులో కుళ్లిపోయిన శవం బయటపడింది.

పోలీసుల విచారణలో హోటల్ యజమాని సిద్దిక్ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. పోలీసులు దర్యాప్తులో పర్హానా, ఆమె భర్త సిబిల్ వ్యవహారం బయటకు వచ్చింది. పర్హానాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సిద్దిక్ ఆ మహిళ, ఆమె భర్త చేతిలో హత్యకు గురైనాడని వెలుగు చూడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications