భారత్ ప్రతీకారం: ఏడుగురు పాక్ సైనికులు హతం, బంకర్లు ధ్వంసం !

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: పాక్ నరరూప రాక్షసులు తమ పైశాచికత్వాన్ని మరో సారి ప్రదర్శించడంతో భారత్ సైన్యం అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ సైన్యంలోని 647 ముజాహిదీన్ బెటాలియన్ కు చెందిన ఏడుగురు సైనికులను భారత సైనం అంతం చేసి గట్టిగా జవాబు ఇచ్చింది.

దాయాది సైనికులను అంతం చెయ్యడంతో పాటు రెండు పాకిస్థాన్ బంకర్లు ధ్వంసం చేసి గట్టిగా సమాధానం ఇచ్చిందని ఓ వార్త సంస్థ తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్ లోని పింపుల్ ప్రాంతంలో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ధ్వంసం చేసిన భారత్ ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్ కు తగిన బుద్ది చెప్పడానికి భారత సైనికులు సిద్దంగా ఉన్నారని ఆర్మీ అధికారులు అంటున్నారు.

 ఇలా దాడి చేశారు

ఇలా దాడి చేశారు

సోమవారం ఉదయం 8.25 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్ లోని భారత్ కు చెందిన ఫార్వారడ్డ్ పోస్ట్ కృపాన్ మీద పాకిస్థాన్ సైన్యంలోని 647 ముజాహిదీన్ బెటాలియన్ చెందిన సైనికులు నేరుగా దాడి చేశారు.

మృతదేహాలను చిద్రం చేశారు

మృతదేహాలను చిద్రం చేశారు

పాక్ ఘాతుకానికి భారత్ కు చెందిని హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్, నాయిబ్ సుబేదార్ పరమ్ జీత్ సింగ్ బలైనారు. వీరిద్దరిని చంపిన పాక్ సైన్యం అత్యంత క్రూరంగా వారి మృతదేహాలను చిద్రం చేశారు. అంతే కాకుండ వారి తలలను మొండెం నుంచి వేరుచేసి పైశాచికత్వాన్ని మరోసారి ప్రదర్శించారు.

పాక్ పైశాచికత్వం

పాక్ పైశాచికత్వం

పాక్ దళాలు ఒక్క సారిగా రాకెట్ లు, మోర్టార్లతో గుళ్ల వర్షం కురిపించడం వలనే ఇద్దరు మరణించారని భారత ఆర్మీ అధికారి పీటీఐ వార్త సంస్థకు చెప్పారు. పాక్ ఇలాగే వ్యవహరిస్తే తగిన బుద్ది చెబుతామని భారత రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు.

పాక్ ను హెచ్చరించిన అరుణ్ జైట్లీ

పాక్ ను హెచ్చరించిన అరుణ్ జైట్లీ

జవాన్ల త్యాగం ఊరికేపోదని పాక్ సైన్యం చేసిన పని అనైతికం, అమానవీయం, భారత సైనికుల మృతదేహాలను చిద్రం చేశారు. ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, మన బలగాలపై దేశం మొత్తానికి విశ్వాసం ఉందని రక్షణ శాఖా మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పాక్ కు తగిన బుద్ది చెబుతామని అరుణ్ జైట్లీ హెచ్చరించారు.

మా సత్తా చూపిస్తాం: ఆర్మీ కమాండర్

మా సత్తా చూపిస్తాం: ఆర్మీ కమాండర్

సైనిక ప్రమాణాలకు విరుద్దంగా మన గస్తీ దళాలలోని ఇద్దరు సైనికుల మృతదేహాలను పాకిస్థాన్ సైన్యం చిద్రం చేసిందని, పాక్ చేసిన ఈ పనికి తగిన విధంగా ప్రతిస్పందిస్తామని నార్తర్న్ ఆర్మీ కమాండర్ అన్నారు. పాక్ చేసిన నీచమైన పనికి భారతీయులు శాపనార్థాలు పెడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a strong message to Pakistan army which killed two Indian soldiers and mutilated their bodies, the Indian army tonight destroyed two Pakistani bunkers and killed seven of their soldiers.
Please Wait while comments are loading...