మూడేళ్ళ బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్ .. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. 3 ఏళ్ల బాలికపై, ఇద్దరు మైనర్ బాలురు అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. ఒక మహిళ తన కూతురు గ్యాంగ్ రేపు కు గురయింది అని పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్ బాలుర పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఐపీసీ సెక్షన్ 376 కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేసినట్లు గా పేర్కొన్నారు.

Three-year-old girl gang-raped by two minors, booked under POSCO Act

పోలీసుల కథనం ప్రకారం తన మూడేళ్ల కుమార్తెపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారని ఒక మహిళ నుండి ఫిర్యాదు వచ్చిందని, తల్లి ఫిర్యాదును అందుకున్న మేరకు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలురను అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించామని వెల్లడించారు. అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులైన బాలురు బాలిక కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారని పోలీసులు తెలిపారు.

దేశంలో మహిళల బాలికల సంరక్షణ కోసం చట్టాలు ఎన్ని ఉన్నా అత్యాచారాలు మాత్రం నిత్యకృత్యంగా మారాయి. ప్రతిరోజు బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చట్టాలకు, శిక్షలకు నేరస్తులు భయపడడం లేదనేది ప్రస్తుత పరిస్థితులను బట్టే అర్థమవుతోంది. మొన్నటికి మొన్న యూపీలో దళిత బాలికపై పబ్లిక్ టాయిలెట్ వద్ద గ్యాంగ్ రేపు జరిగిన ఘటన మరిచిపోకముందే తాజాగా ముంబైలో మూడేళ్ళ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. ఇక గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారు మైనర్ బాలురు కావడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నారుల పెంపకంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+