చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావ్: రసవత్తర రాజకీయాలకు ఫుల్ స్టాప్ !

చెన్నై చేరుకున్న గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావ్ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ ఎదురుచూపురసవత్తర రాజకీయాలకు తెరపడే అవకాశం, రాజ్ భవన్ కు సీఎం, డీసీఎం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి తెరదించడానికి ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ నిర్ణయించారని తెలిసింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన సీహెచ్. విద్యాసాగర్ రావ్ చెన్నై చేరుకున్నారు. గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చెన్నైలోని రాజ్ భవన్ లో సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం భేటీ కానున్నారని తెలిసింది. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీల నాయకులు గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిసే అవకాశం ఉందని సమాచారం.

TN Governor CH Vidyasagar Rao return back Chennai on today

టీటీవీ దినకరన్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిసి తన వర్గంలోని 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మీద స్పీకర్ వేటు వేశారని ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారని ఆయన వర్గీయులు అంటున్నారు. గత నెల రోజుల నుంచి రసవత్తరంగా సాగుతున్న తమిళనాడు రాజకీయాల పరిష్కారం కోసం గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

English summary
Governor Vidyasagar rao who went to Mumbai, on September 8, return back to Chennai on today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X