మోదీ వేరియంట్ టూల్‌కిట్ వివాదం -బీజేపీ చీఫ్ నడ్డా సహా నలుగురి ట్విటర్ ఖాతాల రద్దుకు కాంగ్రెస్ ఫిర్యాదు
కరోనా వైరస్ తనపని తాను చేసుకుంటూ వేలమందిని పొట్టన పెట్టుకుంటుడగా, రాజకీయ పార్టీలు సైతం వైరస్ చుట్టూ వాదులాటలు కొనసాగిస్తున్నాయి. దేశంలో కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో పూర్తిగా విఫలైన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు నేరుగానే తిట్టిపోస్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రం మోదీ పరువు తీయడానికి ఏకంగా టూల్ కిట్ ను రూపొందించిందని బీజేపీ ఆరోపించింది. అయితే, సదరు ఆరోపణను అవాస్తవంగా పేర్కొన్న కాంగ్రస్.. తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ టాప్ నేతలపై ఫిర్యాదులు చేస్తున్నది...
కొవిడ్ పరిస్థితులను అవకాశంగా తీసుకుని కేంద్ర సర్కారుపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిందని, ప్రభుత్వ, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని, దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ గౌరవాన్ని చెడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ధ్వంసరచనకు పాల్పడిందని ఆరోపించిన బీజేపీ.. కొవిడ్-19 మ్యూటెంట్‌ను ''ఇండియన్ స్ట్రెయిన్'', ''మోదీ స్ట్రెయిన్'' అని పిలవాలంటూ తన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ''టూల్‌కిట్'' ద్వారా సూచనలు ఇస్తోందని బీజేపీ ముఖ్యులు వరుసగా కొన్ని డాక్యుమెంట్లను బటయపెట్టారు. అయితే, సదరు డాక్యుమెంట్లను నకిలీవిగా కాంగ్రెస్ గుర్తించింది. ఆ మేరకు..

ట్విట్టర్ వేదికగా అధికార బీజేపీ టూల్‌కిట్ అంశాన్ని ఫోర్జ్‌డ్ డాక్యుమెంట్లను సృష్టిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, సంబిత్ పాత్రా, బి.ఎల్. సంతోశ్ ట్విట్టర్ ఖాతాలను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్విట్టర్‌కు ఓ లేఖ రాశామని కాంగ్రెస్ సోషల్ మీడియా నేత రోహన్ గుప్తా తెలిపారు.
''నకిలీ పత్రాలను వ్యాప్తి చేయడంలో మునిగిపోయిన బీజేపీ నాయకుల ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయాలని కోరుతూ మేము ట్విట్టర్ యాజమాన్యానికి అధికారికంగా లేఖ రాశాం. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ బుక్ అయ్యింది. స్వతంత్రులు కూడా బీజేపీ ప్రచారంలో మునిగిపోయారు. బీజేపీ నేతలు ట్విట్టర్‌ను తప్పుగా వినియోగిస్తున్నారు'' అని రోహన్ గుప్తా మండిపడ్డారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications