Trisha:పొలిటికల్ ఎంట్రీకి హీరోయిన్ త్రిష రెడీ- అక్కడి నుంచే పోటీ..?
Trisha in Politics:అరవ రాజకీయాలు మాంచి ఊపుమీద ఉన్నాయి. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి మరో వైపు అన్నాడీఎంకే బీజేపీ కూటమిలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదంటే తమదే గెలుపని భావిస్తుండగా... రెండు పార్టీలకు ప్రమాదకరంగా తయారయ్యాడు ప్రముఖ తమిళ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌కు తన భార్య నుంచి పొలిటికల్‌గా ప్రాణ సంకటం ఏర్పడింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు గడపను తొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆమె విడాకులు కోరడానికి ప్రధాన కారణం ఓ ప్రముఖ నటి అని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ నటి పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ... ఆమె హీరోయిన్ త్రిష అని తమిళనాడు మొత్తం కోడై కూస్తోంది.
ఓపెన్ అయిపోయిన విజయ్
నిండా మునిగాక చలేముందిలే అన్నట్లుగా విజయ్ కూడా చాలా ఓపెన్ అయ్యాడు. తన భార్య సంగీత విడాకులు కావాలంటూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు తలుపు తట్టింది. ఆమె బ్లాక్‌మెయిల్‌కు బెదిరేది లేదు అని ప్రజలకు స్పష్టం చేసేందుకు కాబోలు... నిన్న ఓ పెళ్లి వేడుకకు నేరుగా త్రిషతో కలిసి విజయ్ తన కారులో వచ్చారు. త్రిష కారులోనుంచి బయటకు దిగగానే అక్కడున్న వారందరూ షాక్ అయిన పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఇన్ని రోజులు త్రిషతో ఉన్న రిలేషన్‌షిప్ పై వస్తున్న వార్తలకు బలం చేకూర్చింది ఈ సన్నివేశం. అంతేకాదు భార్య సంగీతకు కూడా స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపినట్లయ్యింది.విజయ్-త్రిష ఇద్దరూ కలిసి ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో తమిళనాడులో గుసగుసలు ప్రారంభమయ్యాయి.

త్రిష పొలిటికల్ ఎంట్రీ
దక్షిణాది రాజకీయాలు వేరు.. అందులో తమిళ రాజకీయాలు ఇంకాస్త స్పెషల్ అనే చెప్పాలి. అక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అయినవాళ్లున్నారు.. ఫెయిల్ అయినవారు ఉన్నారు. ఉదాహరణకు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటివారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ రాజకీయాలను శాసించారు. అప్పట్లో రజినీకాంత్ పార్టీ పెడతారని ప్రచారం జరిగినా తన ఆరోగ్య దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ ఆయన సక్సెస్ కాలేకపోయారు. దివంగత విజయ్‌కాంత్ మాత్రం కాస్త నిలదొక్కుకున్నారు.
ఇక తాజాగా హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో నిలవబోతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో విజయ్ ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై అసెంబ్లీ సీటును విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి నటి త్రిషను టీవీకే పార్టీ టికెట్ పై పోటీ చేయించాలని భావిస్తున్నారని తమిళ పాలిటిక్స్‌లో ప్రచారం జరుగుతోంది.
చెన్నై అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన సినీ తారలు
సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో ముఖ్యంగా రాజధాని చెన్నైలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి అనేక మంది సినీ నటులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. చెన్నై పార్లమెంటు పరిధిలోని (చెన్నై నార్త్, సెంట్రల్, సౌత్) అసెంబ్లీ స్థానాల నుండి విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టారు.
- ఎంజీఆర్:తమిళ రాజకీయాల్లో మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు ఎంజీ రామచంద్రన్.తమిళ చలనచిత్ర రంగాన్ని, రాజకీయాలను శాసించిన ఎంజీఆర్ చెన్నైలోని నియోజకవర్గాల నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని బలపరుచుకున్నారు.1967లో ఎంజీఆర్ మొదటిసారి పరంబూర్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 1971లో సెయింట్ థామస్ మౌంట్ నుండి విజయం సాధించారు.
- జయలలిత:నటిగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన జయలలిత, చెన్నై నగరాన్ని తన రాజకీయ కోటగా మార్చుకున్నారు.2015ఉప ఎన్నికలో2016 సాధారణ ఎన్నికల్లో జయలలిత చెన్నైలోని ఆర్కే నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.1980వ దశకంలో ఆమె రాజకీయ ప్రస్థానం మైలాపూర్ నుండే బలంగా సాగింది.
- ఎం. కరుణానిధి: కరుణానిధి కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప సినీ రచయిత కూడా. ఆయన రాసిన డైలాగులు ఎంతో మంది నటులను స్టార్లను చేశాయి.1967, 1971లలో కరుణానిధి సైదాపేట్ నుంచి పోటీ చేసి గెలిచారు.1977, 1980లలో అన్నానగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.1989, 1991లలో హార్బర్ నుంచి విజయం సాధించారు.1996, 2001, 2006లలో చేపాక్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా గెలుపొందారు.
- ఉదయనిధి స్టాలిన్: ప్రస్తుతం తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేపాక్-తిరువల్లికేణి నుండి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందారు.
- ఎస్.వి. శేఖర్: ప్రముఖ హాస్య నటుడు,నాటక కర్త ఎస్.వి.శేఖర్ కూడా చెన్నై నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరపున మైలాపూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
- నెపోలియన్ : ప్రముఖ నటుడు నెపోలియన్ 2001లో విల్లివాక్కం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
మొత్తానికి తమిళ రాజకీయాల్లో చెన్నై నగరం కీలక పాత్ర పోషించింది. చెన్నైలోని అసెంబ్లీ స్థానాలు సినీ గ్లామర్‌కు ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్కే నగర్, చేపాక్, మైలాపూర్ నియోజకవర్గాలు సినీ రంగానికి చెందిన ఉద్ధండులకు వేదికలుగా నిలిచాయి. అయితే రానున్న ఎన్నికల్లో త్రిష చెన్నైలోని ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుందో ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే తన రాజకీయ అరంగేట్రంపై మాత్రం త్రిష ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం ఉన్నందున ఇవన్నీ చకచకా జరిగిపోయే అవకాశాలున్నాయి.
-
త్రిషతో విజయ్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంపై బిగ్ బాస్ బ్యూటీ షాక్ -
విడాకుల వివాదం, త్రిషతో రూమర్స్.. మౌనం వీడిన విజయ్ ! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
తమిళనాడు ఎన్నికలు.. విజయ్ హామీలు ఇవే.. -
తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!!













Click it and Unblock the Notifications