దమ్ముంటే ఎన్నికల కమిషన్ కు లేఖ ఇవ్వండి: సీఎంకు చాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమినాడు ముఖ్యంత్రి ఎడప్పాడి పళనిసామి చాల ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయన నమ్మక ద్రోహం చేశారని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి త్వరలో తగిన బుద్ది చెబుతామని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.

శశికళకు షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్, అసలు విషయం తెలిసింది, మన్నార్ గుడి కథ క్లోజ్ !

శుక్రవారం తంజావూరులో మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ ఎడప్పాడి పళనిసామి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా తొలగించడానికి ఎడప్పాడి పళనిసామికి ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు.

 TTV Dinakaran again says EPS resolution against him is invalid

తనను పదవి నుంచి తొలగించామని ఎడప్పాడి పళనిసామి సంతకం చేసి ఎన్నికల కమిషన్ కు సమర్పించే దమ్ము ఉందా అంటూ టీటీవీ దినకరన్ ప్రశ్నించారు. అన్నాడీఎంకే పార్టీ మీద శశికళ తరువాత సర్వాధికారాలు అన్నీ నాకే ఉన్నాయని టీటీవీ దినకరన్ చెప్పారు.

ఢిల్లీలో మకాం వేసిన పళనిసామి, పన్నీర్ సెల్వం, రాజీ కోసం బీజేపీ పెద్దలు, కలిసి చెన్నైకి !

మరో వైపు టీటీవీ దినకరన్ మద్దతుదారుడు, అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది మీడియాతో మాట్లాడుతూ త్వరలో దినకరన్ చెన్నై వెలుతారని, అక్కడికి వెళ్లిన తరువాత అందరికీ తగిన బుద్ది చెబుతాడని, ఎడప్పాడి పళనిసామి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేరని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran says that it is dangerous for those who were signed in the CM Palanisamy passed resolution if they submitted at election comission.
Please Wait while comments are loading...