లైంగిక వేదింపులు: దివైరల్ ఫివర్ సీఈఓ అర్నాబ్ గుడ్ బై

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ది వైరల్ ఫివర్ సీఈవో అర్నాబ్ కుమార్ బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. ఇక నుండి సంస్థకు తాను మార్గ నిర్ధేశకుడిగానే వ్యవహరిస్తానని ఆయన ప్రకటించారు.

ఆయన స్థానంలో కొత్త సీఈవోగా దావల్ గుసెయిన్ బాధ్యతలను స్వీకరించనున్నారని చెప్పారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

TVF CEO Arunabh Kumar, Accused Of Sexual Harassment, Steps Down

తనపై వ్యక్తిగత దాడి జరుగుతున్నందున సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున సీఈఓ బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.

వ్యక్తి కంటే సంస్థ గొప్పదని నమ్ముతానని ఆయన ట్వీట్ చేశారు. సంస్థకు మెంటర్ గా మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అర్నాబ్ కుమార్ 2011 లో టీవీఎప్ అనే వెబ్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థను ప్రారంభించారు.

తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం మానేసిన మాజీ ఉద్యోగిణి ఆరోపణలు చేసింది.దీనికి బాధ్యత వహిస్తూ ఆయన బాధ్యతల నుండి తప్పుకొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Arunabh Kumar, accused of sexual harassment by a former employee, has stepped down as CEO of web entertainment firm The Viral Fever (TVF), as he "believes the organisation is bigger than the individual."
Please Wait while comments are loading...