బర్త్ డేకి పిలిచి బాలికపై అత్యాచారం .. గర్భం దాలిస్తే మాత్రలు వేసి... ఇద్దరు యువకుల దారుణం
ఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా మృగాళ్ళు మాత్రం అఘాయిత్యాలు ఆపటం లేదు . బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు .ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా సరే అభం శుభం తెలియని మినార్ బాలికలు ఇంకా కామాంధుల చేతుల్లో చిక్కి విలవిలలాడుతున్నారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా అవేవీ పట్టనట్టు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు.
పుట్టినరోజు వేడుక ఉందని ఇంటికి పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన ఒడిశాలోని చాపర గ్రామంలో జరిగింది.తల్లిదనృలు లేక అనాధగా మారిన ఓ బాలిక అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటోంది. స్థానికంగా ఉండే స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఇక అది గమనించిన ఇద్దరు యువకులు ఆ బాలికపై కన్నేశారు. పరిచయం పెంచుకొని స్నేహం చేశారు.తనను పుట్టినరోజుకు ఆహ్వానించి ఆమెపై అఘాయిత్యం చేశారు .

ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి బాలిక అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో అత్యాచారం చేశారు. కొన్ని రోజులకు ఆ బాలిక గర్భం ధరించడంతో, ఇద్దరు వ్యక్తులను నిలదీసింది. దీంతో ఆ బాలికకు బలవంతంగా గర్భనిరోధక మాత్రలు మింగించారు.ఎవరికీ చెప్పొద్దని చెప్పారు . కానీ గర్భనిరోధక మాత్రలు మింగడంతో, బాలికకు రక్తస్రావం అయ్యింది. విపరీతమైన నొప్పితో ఏం జరుగుతుందో అని భయపడిన ఆ బాలిక జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. అనంతరం, ఆ బాలిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications