ఉజ్జయిని సిగ్గుతో తలదించుకున్న వేళ- రేప్ తర్వాత రక్తంకారుతూ, అర్ధనగ్నంగా సాయం కోసం బాలిక..!
మధ్యప్రదేశ్ లో దేశం సిగ్గుతో తలవంచుకునే ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక నగరం ఉజ్జయిని లో పట్టపగలే దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైన ఓ 12 ఏళ్ల బాలిక సాయం కోసం అర్ధించిన తీరు, దానికి జనం స్పందించని వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. చివరికి పోలీసులు ఆమెకు రక్తమిచ్చి బతికించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఒక ఆశ్రమ పూజారి.. స్ధానికంగా తిరుగుతున్న 12 ఏళ్ల అత్యాచార బాధితురాలిని రక్షించారు. అయితే అంతకు ముందే ఆమెను ఆదుకునేందుకు చాలా మంది నిరాకరించారు. ఈ సమయంలో ఆ మైనర్ బాలిక అనుభవించిన నరకాన్ని సదరు పూజారి రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆశ్రమం నుంచి తాను బయలుదేరుతున్నప్పుడు ఆశ్రమం గేట్‌ల దగ్గర ఆమె రెండు కాళ్లలో రక్తం కారడంతో పాక్షిక నగ్నంగా, గాయాలతో ఆ బాలిక కనిపించింది.

12 ఏళ్ల బాలిక రేప్ తర్వాత రక్తస్రావం, పాక్షిక నగ్న స్థితిలో సహాయం కోసం ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇందులో కొన్ని ఇళ్ల వారు ఆమెను తరిమికొట్టారని కూడా తేలింది. తాను ఆమెకు బట్టలు ఇచ్చినట్లు పూజారి తెలిపారు. ఆమెకు రక్తం కారుతోందని, మాట్లాడలేకపోయిందని వెల్లడించారు. ఆమె కళ్ళు వాచిపోయాయని, తాను వెంటనే 100కి కాల్ చేసానని తెలిపారు. హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులు వెంటనే చేరుకోకపోవడంతో స్ధానిక మహాకాల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి వారికి పరిస్ధితి తెలియజేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 20 నిమిషాల్లో పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారని పూజారి వెల్లడించారు.
చివరికి పూజారి సాయంతో పోలీసుల వద్దకు చేరిన బాలికకు వారే రక్తదానం చేసి కాపాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఇండోర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు హోంమంత్రి ప్రకటించారు. అమ్మాయి ఎక్కడి నుండి వచ్చిందో తమకు ఖచ్చితంగా చెప్పలేకపోయిందని, కానీ ఆమె ఉచ్ఛారణ బట్టి ఆమె ప్రయాగ్‌రాజ్‌కి చెందినదని తెలుస్తుందన్నారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications