వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైదిక్‌పై రాహుల్, షేమ్: భారత్‌పై సయీద్ వరుస ట్వీట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌తో యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు, జర్నలిస్టు వేద ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం స్పందించారు. వైదిక్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యక్తి అని చెప్పారు. వైదిక్ పాక్ వెళ్లేందుకు ప్రభుత్వం ప్రభుత్వం సాయం చేసిందని ఆరోపించారు. హఫీజ్‌తో వైదిక్ భేటీ అయినట్లు ఎంబసీకి తెలియదా అని ప్రశ్నించారు.

కాగా, తన పైన వచ్చిన విమర్శలను వేద ప్రతాప్ వైదిక్ ఖండించిన విషయం తెలిసిందే. విలేకరిగా తాను ఎవరినైనా కలుస్తానని చెప్పారు. తన భేటీ అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

మరోవైపు, హఫీజ్ మహమ్మద్ సయీద్ కూడా దీనిపై స్పందించారు. ఆయన ట్వీట్ చేశారు. తమను ఎవరు కలుసుకోవాలనుకున్నా తాము కలుస్తామని సయీద్ చెప్పాడు. దేశం, మతంతో సంబంధం లేకుండా తాము కలుస్తామని ఓ ట్వీట్ చేశారు.

Ved Pratap Vaidik an RSS man: Rahul

మరో ట్వీట్‌లో... బాధాకరమంటూ భారత్‌ది సోకాల్డ్ సెక్యూలరిజం అన్నాడు. జర్నలిస్టు భేటీని కూడా రాజకీయం చేయడంపై ఆయన స్పందించారు. భారత్ సంకుచిత మనస్తత్వానికి (నారో మైండ్‌నెస్)కు ఇది నిదర్శనమన్నాడు.

మరో ట్వీట్‌లో.. భారత్ ఇచ్చిన 26/11 ఆధారాల పైన చర్చించినట్లు చెప్పాడు. అలాగే భారత్ పాకిస్తాన్ కోర్టులను ఎందుకు గౌరవించదని అడిగినట్లు చెప్పాడు.

మరో ట్వీట్‌లో... జర్నలిస్టుతో తన భేటీని పార్లమెంటులో రచ్చ చేయడం తీవ్రవాదాన్ని తెలుపుతుందని, రాజకీయ నాయకుల సంకుచిత మనస్తత్వం తెలియ చేస్తోందని, ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నాడు.

మరో ట్వీట్‌లో... మోడీ పాకిస్తాన్‌కు వస్తే నిరసన వ్యక్తం చేస్తారా అని వైదిక్ తనను అడిగాడని, అలాంటి రాజకీయాలు, నిరసనలకు తాము దూరంగా ఉంటామని వైదిక్‌కు చెప్పానని సయిద్ ట్వీట్ చేశాడు.

English summary
A major controversy erupted over a meeting between Ved Pratap Vaidik, a journalist considered close to yoga guru Baba Ramdev and 26/11 Mumbai terror blasts mastermind Hafiz Saeed in Pakistan, with the Congress targeting the Prime Minister’s Office over the meeting, alleging its “direct involvement” and asking the Narendra Modi government to “come clean” on the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X