షాక్: బైక్ రేసుల తరహాలోనే ప్రైవేట్ బస్సుల రేసింగ్, డ్రైవర్ల లైసెన్స్ రద్దు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై:; ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు విపరీతమైన స్పీడ్ తో నడుపుతారని తెలుసు. మోటార్ బైక్ రేసుల తరహాలోనే ఇద్దరు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు పోటీలు పడీ డ్రైవింగ్ చేశారు. ఈ బస్సులు అత్యంత ప్రమాదకరంగా వస్తుండడంతో ఎదరుగా వచ్చే వాహనాల డ్రైవర్లు భయపడిపోయారు. తమిళనాడులో రెండు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు పోటీలు పడి నడిపిన తీరును ఓ వ్యక్తి వీడియో తీసి సొషల్ మీడియోలో అప్ లోడ్ చేశాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

తమిళనాడులోని కోయంబత్తూరులో రెండు బస్సులు జాతీయ రహాదారిపై రేసులో పాల్గొన్నట్టుగా పోటీపడుతూ ప్రమాదకరంగా నడిపారు డ్రైవర్లు. అయితే ఈ బస్సుల్లో ఉన్న ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చొన్నారు.

bus

వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశ్యంతో డ్రైవర్లు బస్సులను వేగంగా నడిపారు.రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రమాదకరంగా పక్కదారిలో బస్సులను నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనదారులను బెంబేలెత్తించారు.

ఈ రెండు బస్సుల వెనకే బైక్ పై వస్తోన్న ఇద్దరు ఈ బస్సుల రేసింగ్ ను తమ సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. దీనిపై పోలాచి సబ్ కలెక్టర్ గాయత్రి కృష్ణన్ విచారించారు.

బస్సు యజమానులను పిలిపించి బస్సు డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేసినట్టు కృష్ణన్ తెలిపారు. కొన్ని నెలలుగా ట్రాఫిక్ విషయంలో కఠిన నిబంధనలను విధించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ బస్సులు వెళ్తున్న మార్గంలో ప్రయాణీకులు ఎక్కువగా ఉంటారని వారిని గమ్యస్థానాలకు చేర్చి సొమ్ముచేసుకొనేందుకుగాను వేగంగా బస్సులను నడుపుతుంటారని కృష్ణన్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after a video of two private buses being driven rashly on the Pollachi Road went viral on social media, the district police registered cases against more than 30 private bus drivers plying on the route and also detained the buses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి