వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు జనం ముందుకు విజయ్ మాల్యా!

|
Google Oneindia TeluguNews

లండన్: మన దేశంలోని బ్యాంకుల్లో తీసుకున్న రూ.9వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ఎట్టకేలకు జనం ముందుకు రానున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు.

అయితే, ప్రస్తుతం యూకేలోని లండన్‌లో నివాసం ఉంటున్న మాల్యా.. శుక్రవారం అక్కడే జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Vijay Mallya to make rare public appearance on Friday

వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాగా, గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది.

మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించారని తేల్చింది. అయితే, మాల్యా మాత్రం భారతదేశానికి రావడంపై స్పష్టం ఇవ్వడం లేదు.

English summary
Troubled Indian businessman Vijay Mallya is set to make a rare public appearance in the United Kingdom on Friday when he is scheduled to attend the team bosses press conference ahead of the Formula 1 British Grand Prix.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X