ఐపీఎల్ లోనూ గంగూలీ వర్సెస్ కొహ్లీ వార్- ఎడమొహం, పెడమొహం-ఇన్ స్టాలో అన్ ఫాలోస్..

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సొరభ్ గంగూలీకి మధ్య గతంలో నెలకొన్న వివాదం ఇప్పటికీ కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. గతంలో కొహ్లీ టీ20 జట్టు కెప్టెన్సీ వదులుకున్న తర్వాత నెలకొన్న ఈ వివాదం తాలూకు మంటలు ఇప్పుడు ఐపీఎల్ లోనూ కొనసాగుతున్నాయి. నిన్న డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి ప్రవర్తనే అందుకు నిదర్శనం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫ్యాన్స్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ట్రెండింగ్ లో నిలిచారు. దీనికి కారణం గతంలో వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాలే. కోహ్లి, గంగూలీ నిన్నటి మ్యాచ్ సందర్భంగా పరస్పరం చూసుకునే అవకాశం వచ్చినా ఇష్టపడలేదు. దీంతో అభిమానుల దృష్టి సహజంగానే వారిపైకి మళ్లింది. ఇది అంతటితో ఆగలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ వెళ్లిపోయిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

Virat Kohli unfollows Saurav Ganguly in Instagram

గంగూలీ బీసీసీఐకి నాయకత్వం వహిస్తున్నప్పుడు కెప్టెన్సీ వివాదం తర్వాత ఇద్దరి మధ్య అగాధం ఇంకా పూడలేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్దితుల్లో ఇప్పుడు తాజాగా కోహ్లి సోషల్ మీడియా వేదికగా తీసుకున్న ఓ నిర్ణయం కూడా మంటలకు ఆజ్యం పోసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేశాడు. సోషల్ మీడియా యాప్‌లో గంగూలీ ఇప్పటికీ విరాట్ కోహ్లీని అనుసరిస్తున్నాడు.

2021లో విరాట్ కోహ్లీను టీ20 కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత వివాదాస్పదంగా వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించారు. సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని సౌరవ్ గంగూలీ అప్పట్లో చెప్పాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని కోహ్లిని అభ్యర్థించామని కూడా చెప్పాడు. ఇది బీసీసీఐ, సెలెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయమన్నాడు. నిజానికి, బీసీసీ టీ20 కెప్టెన్‌గా వైదొలగవద్దని విరాట్‌ను అభ్యర్థించిందని, కానీ అతను అంగీకరించలేదన్నాడు. సెలెక్టర్లు రెండు వైట్ బాల్ ఫార్మాట్లలో ఇద్దరు వేర్వేరు కెప్టెన్‌లను కలిగి ఉండటం సరైనదని భావించలేదన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+