
viral video:వావ్.. తాబేలుతో చింపాంజీ స్నేహం, యాపిల్ పండు షేర్, వైరల్
జంతువుల మధ్య స్నేహ సంబంధం రేర్.. అవీ షేర్ చేసుకొని తినడం చూసి ఉండం.. ఎప్పటికీ గొడవకు దిగుతుంటాయి. ఇక పెద్ద జంతువు కరుణ చూపడం అంటూ ఉండదు. అవును.. కానీ ఈ వీడియో మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఓ చింపాంజీ.. తాబేలుతో స్నేహం చేసింది. ఇదేదో పొడుపు కథ కాదు.. నిజం. అదీ చూడు ఎలా పండు షేర్ చేసుకుంటుందో.. మీరు ఆ వీడియో చూడండి.

తాబేలుతో షేరింగ్..
వీడియోలో చింపాంజీ పండును తాబేలుతో పంచుకుంటుంది. వీడియోను ట్విట్టర్‌లో ఒకరు షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ షేరింగ్ ఈస్ కేరింగ్ అని పెట్టారు. మీరు కూడా చూడండి. చాలా మంది వావ్ అని కామెంట్ చేశారు. వీడియోలో చింపాంజీ ఆపిల్ పండు తినడంతో మొదలవుతుంది. అదీ ఒక బుక్క కొరికిన తర్వాత.. తినమని తాబేలుకు ఇస్తోంది. తర్వాత మరో చింపాంజీ కూడా వీడియోలో కనిపిస్తోంది. వీరి మధ్య స్నేహంపై నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్..
వీడియోకు ఇప్పటికే 8.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3.4 లక్షల లైకులు వచ్చాయి. వీడియోకు ఇప్పటికే 49 వేల మంది రీ ట్వీట్ కూడా చేశారు. చింపాంజీ ప్రవర్తనను చాలా మంది అభినందిస్తున్నారు. తల్లి ఎప్పుడూ చెబుతుంది.. తినడం కాదు షేర్ చేయడం బెస్ట్ అని ఒకరు రాశారు. వావ్ ఆ చింపాంజీ చూడు.. ఎంత మంచిగా తన ఫ్రెండ్‌కు ఇస్తోందని రాసుకొచ్చారు. ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.

అప్పుడు ఆరెంజ్
ఇదివరకు మరొ చింపాంజీ వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదీ అడవీలో ఆరెంజ్ పండ్లను తీసుకొచ్చిన వీడియో కనిపించింది. చేతిలో.. కాళ్లతో.. నోట్లో కూడా ఒకటి పెట్టుకుంది. ఆ వీడియోను కూడా చాలా మంది షేర్ చేశారు. వావ్ అంటూ కామెంట్లు చేశారు. ఆ వీడియోకు 2.3 మిలియన్ల వ్యూస్.. వేలాది లైకులు వచ్చాయి.
Sharing is caring.. 😊 pic.twitter.com/XnFgiZHbsY
— Buitengebieden (@buitengebieden) July 17, 2022