VIRAL VIDEO:అమెజింగ్, బోరులో పడిన పప్పీ, సేవ్ చేసిన జవాన్
బోర్ వెల్స్ తెరచి ఉంటే ప్రమాదం.. అప్పుడప్పుడు చిన్నారులు అందులో పడిపోతుంటారు. చాలా కష్టపడి మరీ వెలికి తీసిన ఘటనలు ఉంటాయి. అయితే అందులో జంతువులు పడితే.. అదే కుక్క, పిల్లి, ఎలుక పడిదంటే అంతే సంగతులు.. కానీ ఉక్రెయిన్ సైనికులు అలా వదలిపెట్టలేదు. బోర్‌లో పడిన డాగ్‌ను వెలికి తీశారు. అయితే అదీ ఎక్కువ లోతు లేకపోవడం కలిసి వచ్చింది. ఏకంగా ఓ ఆర్మీ జవాన్ అందులో దిగి మరీ తీశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది.

జవాన్ల గస్తీ
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. దీంతో ఆ దేశం తీవ్రంగా నష్టపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి కూడా చిన్నా భిన్నం అవుతుంది. శత్రువులతో ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. గత కొన్ని నెలలుగా సైన్యం ఇంటి మొహం చూడలేదు. దేశ ప్రజల రక్షణ కోసం నిలబడ్డారు. సరిహద్దులో గస్తీ కాస్తున్నారు.

మూగజీవాల బలి
దాడులతో మూగ జీవాలు కూడా బలి కావాల్సి వస్తోంది. ఓ డాగ్ బోర్‌వెల్‌లో పడిపోయింది. దాని అరుపులు వినిపించడంతో జవాన్లు రంగంలోకి దిగారు. ఇంకేముంది ముగ్గురు జవాన్లు కలిసి సేవ్ చేశారు. ఓ జవాను తలకిందులుగా పంపించారు. అతను లోపలికి వెళ్లి.. ఆ కుక్కను తీసుకొని వచ్చాడు. ఇద్దరు చెరో కాలును జాగ్రత్తగా పట్టుకున్నారు. మెల్లిగా బయటకు వచ్చేశారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.
టిక్ టాక్‌లో పోస్ట్
వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు జవాన్లు ఓ కుక్కను వెలికి తీశారని పేర్కొన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. నెటిజన్లు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా తమ అభిప్రాయం రాస్తున్నారు. ఆ ఇద్దరు స్ట్రాంగ్ అని.. అందుకే ఒకతను లోపలికి వెళ్లిన గట్టిగ పట్టుకొని ఉన్నారని తెలిపారు. అవును ఆ కుక్కను సేవ్ చేశారని మరొకరు రాశారు. అందులో పప్పీ భలే ఇరుక్కొందని.. అరుపులు అరిచిందని తెలిపారు. ఆ వీడియో ఇప్పటికే 50 వేల వ్యూస్ కూడా వచ్చాయి. చాలా మంది కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications