వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మోడీ గురించి ఏం మాట్లాడినా..! ప్రాబ్లమే..'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరికొద్ది రోజుల్లో పదవి నుంచి వైదొలగబోతున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. ప్రధాని మోడీపై స్పందించాలన్న వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు. మోడీపై తనెలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా..! అవి సమస్యాత్మకంగా మారుతున్నాయని, అందుకే ఈ ప్రశ్నను దాటవేయాలనుకుంటున్నానని సమాధానమిచ్చారు రాజన్.

బీబీసీ కి ఇచ్చిన ఇంటర్య్యూలో భాగంగా.. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో మోడీపై స్పందించాల్సిందిగా కోరారు సదరు ప్రోగ్రామ్ యాంకర్. దీనిపై స్పందిస్తూ.. ఈ ప్రశ్నను పాస్ చేస్తానంటూ జవాబిచ్చారు రాజన్.

Whatever I say about PM Modi will be ‘problematic’: Raghuram Rajan

ఇకపోతే గతంలో రాజన్ వ్యాఖ్యల వల్ల.. కేంద్రానికి ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. అందుకే మరోమారు ఆయనకు ఆర్బీఐ పదవిని కట్టబెట్టడానికి కేంద్రం వెనుకాడింది. ఈలోగా రెండోసారి పదవి చేపట్టడానికి సిద్దంగా లేనని తానే ప్రకటించారు రాజన్. పదవి నుంచి తప్పుకున్నాక..! గతంలో తాను పనిచేసిన అధ్యాపక వ్రుత్తిలోకే వెళ్తానని రాజన్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు.

English summary
Reserve Bank’s outgoing governor Raghuram Rajan feels that whatever he will say on Prime Minister Narendra Modi will be “problematic”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X