వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త:వాట్సాప్ లో నగదు లావాదేవీలు, పేటీఎంకు చెక్?

పేమేంట్లు, మనీట్రాన్స్ ఫర్లు ఇక వాట్సాప్ నుండి కూడ చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.డిజిటల్ ఇండియాకు చేయూతను ఇచ్చేందుకుగాను వాట్సాప్ వినూత్న కార్యక్రమానికి సన్నద్దమౌతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:పేమేంట్లు, మనీట్రాన్స్ ఫర్లు ఇక వాట్సాప్ నుండి కూడ చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.డిజిటల్ ఇండియాకు చేయూతను ఇచ్చేందుకుగాను వాట్సాప్ వినూత్న కార్యక్రమానికి సన్నద్దమౌతోంది

నల్లధనం నిర్మూలనకుగాను కేంద్రం డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే వాట్సాప్ ఈ మేరకు కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.

ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్ త్వరలోనే ఇండియాలో డిజిటల్ సర్వీసుల్లోకి రావడానికి సన్నద్దమౌతోందని సమాచారం.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లను కేంద్రం ప్రయత్నిస్తోంది.అయితే ఇన్ స్టాంట్ మేసేజింగ్ యాప్ లో ఎక్కువగా ఫేమస్ అయిన వాట్సాప్ కూడ ఆ దిశగా చర్యలు చేపడుతోంది.

WhatsApp gearing up to launch digital payment service in India

యూపీఐ వాడుతూ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ అయ్యేలా కంపెనీ ప్రస్తుతం వర్క్ చేస్తోందని ఈ చాట్ యాప్ ద్వారానే అన్ని పేమెంట్లు జరిగేలా ఇండియన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ తెలిసిన టెక్నికల్, ఫైనాన్సియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉద్యోగుల కోసం కంపెనీ గాలిస్తున్నట్టు వాట్సాప్ వెబ్ సైట్ ఓ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

వచ్చే ఆరునెలల్లోనే ఈ సర్వీసులను ప్రారంభించబోతున్నారు. డిజిటల్ సర్వీసుల్లోకి దూసుకెళ్తున్న పేటీఎంకు చెక్ పెట్టి వాట్సాప్ ఆ స్థానాన్ని పొందేందుకు ఈ ప్రయత్నం చేస్తోంది.ప్రస్తుతమున్న 20 కోట్ల యూజర్ బేస్ ను మరింత పెంచుకోవాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. ఇండియన్ యూజర్ల కోసం స్పెషల్ ఫీచర్ ను తీసుకురానున్నట్టుగా వాట్సాప్ ప్రకటించింది.

English summary
A WhatsApp move into digital payments in India, its biggest market that is home to 200 million of its billion plus global users, would replicate similar moves by messaging apps like Tencent Holdings Ltd's WeChat in China. WhatsApp is working to launch person-to-person payments in India in the next six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X