Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chandrayaan-3 : చంద్రయాన్-3 వెనుక వీరే.. ! రూ.700 కోట్ల ప్రాజెక్ట్ వీళ్ల చేతుల్లోనే..!

చంద్రుడి రహస్యాలు ఛేదించేందుకు భారత దేశం ప్రయోగించిన చంద్రయాన్ మూడో మిషన్ ఇవాళ చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో చంద్రయాన్ -3 ప్రయోగం అనుకున్న లక్ష్యం సాధించిందా లేదా అన్నది కూడా తేలిపోనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఎవరున్నారు ? దాదాపు రూ.700 కోట్ల ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఈ క్రెడిట్ ఎవరికి వెళ్లబోతోంది అన్న చర్చ కూడా సాగుతోంది.

చంద్రయాన్ -3 ప్రాజెక్టు కోసం నాలుగేళ్లుగా పలువురు ఇంజనీర్లు,శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలోనూ కఠిన పరిస్ధితుల్లో ఈ ప్రాజెక్ట్ కోసం వీరంతా పనిచేశారు. ఈ మిషన్ కోసం దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు పనిచేసినట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్ నాథ్ తాజాగా వెల్లడించారు. వీరిలో తనతో పాటు పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి కూడా పనిచేశారు.

who are the master brains behind chandrayaan-3 ? what isro chairman says ?

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ కోసం పనిచేసిన వారిలో అత్యంత కీలక వ్యక్తి ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్. రాకెట్ రూపకల్పనలో లాంచ్ వెహికల్ మార్క్-3 లేదా చంద్రయాన్-3ని కక్ష్యలోకి ఎక్కించిన బాహుబలి రాకెట్ రూపకల్పనలో సోమ్ నాథ్ దే కీలక పాత్ర.ఇస్రో అధిపతిగా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని రాకెట్‌లోకి పంపే ముందు పూర్తిగా పరీక్షించేలా చూసుకున్నారు. అలాగే అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపే భారతదేశ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పూర్వ విద్యార్థి అయిన సోమ్ నాథ్.. చంద్రయాన్ కు ముందు పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు.

who are the master brains behind chandrayaan-3 ? what isro chairman says ?

అలాగే చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్ కూడా నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసమే గడిపారు. చెన్నై నుంచి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ సాధించిన వీరముత్తువేల్.. గతంలో చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో పాల్గొన్నారు. 2019లో విఫలమైన ల్యాండర్ విక్రమ్‌కు సంబంధించిన ఆయన వారసత్వ పరిజ్ఞానం, పటిష్టమైన చంద్రయాన్-3 మిషన్‌ను రూపొందించడానికి పనికొచ్చింది.

ఈ మిషన్ లో మరో కీలక వ్యక్తి బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వనిత. ఈమె చంద్రయాన్-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్ అయిన ఆమె.. చంద్రుని మిషన్‌కు నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళ కూడా. చంద్రయాన్-2 గురించి ఆమెకున్న పరిజ్ఞానాన్ని చంద్రయాన్-3ని రూపొందించిన బృందం సమర్థంగా వాడుకుంది.

who are the master brains behind chandrayaan-3 ? what isro chairman says ?

అలాగే ఇస్రో పవర్ హౌస్ బాధ్యతలు చూసిన ఎం.శంకరన్ కూడా చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లో చాలా కీలకంగా వ్యవహరించారు.కొత్త పవర్ సిస్టమ్‌లు, పవర్ శాటిలైట్‌లకు వెళ్లే సౌర శ్రేణులను తయారు చేయడంలో ఆయన నైపుణ్యం. ఉపగ్రహాల తయారీలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఆయనకు ఉంది. చంద్రయాన్-1, మంగళయాన్, చంద్రయాన్-2 ఉపగ్రహాలు పంపడంలో శంకరన్ పాత్ర ఎంతో ఉంది. చంద్రయాన్-3 ఉపగ్రహం తగినంత వేడిగా, చల్లగా టెస్ట్ చేసినట్లు నిర్ధారించుకోవడం ఆయన పని. ల్యాండర్ బలాన్ని పరీక్షించడానికి చంద్రుని ఉపరితల ప్రతిరూపాన్ని రూపొందించడంలో ఆయన సాయం చేశారు.

మరోవైపు తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్ వీ నారాయణన్ కూడా చంద్రయాన్ -3 కోసం తీవ్రంగా కష్టపడ్డారు. లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్‌లపై నిపుణుడు అయిన ఆయన నేతృత్వంలో రూపొందిన ధ్రస్టర్లపైనే ఇవాళ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కాబోతోంది. చంద్రయాన్-3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లపై ఆయన వ్యక్తిగత ముద్ర ఉంది. అలాగే ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్, కమాండ్ నెట్వర్క్ డైరెక్టర్ అయిన బీఎన్ రామకృష్ణ కూడా చంద్రయాన్-3లో కీలకంగా వ్యవహరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+