వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయం గవర్నర్ ఎందకు తీసుకున్నారు...?

|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. పీడీపీ కాంగ్రెస్‌లు చేతులు కలపడం వారికి ఎన్సీ పార్టీ మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే దిశగా అడుగులు ముందుకు పడ్డాయి. ఇక అప్పటికే అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో సీఎం అభ్యర్థిగా పీడీపీ మాజీ మంత్రి అల్తాఫ్ బుఖారీ పేరు తెరపైకి వచ్చింది. ఇక ప్రభుత్వం ఏర్పాటే తరవాయిగా అన్నట్లు పరిస్థితి కనిపించింది. అంతలోనే అందరికీ షాక్ ఇస్తూ జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాలు వేడెక్కాయి... అసలు సత్యాపాల్ మాలిక్ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారు.. కేంద్రం కనుసన్నల్లోనే ఈ నిర్ణయం జరిగిందా... రాజకీయ విశ్లేషకులు ఏమి చెబుతున్నారు..?

 గవర్నర్ నిర్ణయంతో షాక్ తిన్న పార్టీలు

గవర్నర్ నిర్ణయంతో షాక్ తిన్న పార్టీలు

జమ్మూ కశ్మీర్‌లో రాజకీయాలు కాకమీద ఉన్నాయి. కొన్నినెలలుగా అక్కడ ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉండగా... జమ్ముకశ్మీర్‌లో సరైన పాలన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యోచించాయి. అన్ని చర్చలు ముగిసిన తర్వాత గవర్నర్ నుంచి వారికి షాక్ తగిలింది. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉన్నట్లుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ రద్దుకు నాలుగు కారణాలు చూపిన గవర్నర్

అసెంబ్లీ రద్దుకు నాలుగు కారణాలు చూపిన గవర్నర్

గవర్నర్ సత్యపాల్ మాలిక్ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు. ఇందులో బేరసారాల అంశం, ప్రభుత్వం ఏర్పాటుకు బద్ద శత్రువులు ముందుకు రావడం అంటే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని గవర్నర్ భావించడం, రాజకీయ భావజాలాలు వేరుగా ఉండటం వల్ల కూడా స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాదని భావించిన గవర్నర్ సత్యపాల్... జమ్మూ అసెంబ్లీని రద్దు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాజభవన్ వర్గాలు తెలిపాయి.

 వేర్వేరు రాజకీయ భావజాలాలున్న పార్టీలతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాదు

వేర్వేరు రాజకీయ భావజాలాలున్న పార్టీలతో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాదు


వివిధ వర్గాల నుంచి తెప్పించుకున్న సమాచారం మేరకు గవర్నర్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. వివిధ రకమైన రాజకీయ భావజాలాలు ఉన్న పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయని అయితే వీటి వల్ల స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కాదని గవర్నర్ భావించినట్లు ప్రకటన పేర్కొంది. అంతేకాదు అంతకుముందు ఇవే పార్టీలు అసెంబ్లీని రద్దు చేయాలంటూ పలుమార్లు గవర్నర్ దగ్గరకు వచ్చాయని గుర్తు చేశారు రాజ్‌భవన్ అధికారులు . అంతేకాదు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకీ లేనందున అరకొర సీట్లున్న పార్టీలు కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని ...ఇదే విషయం గతంలో కూడా జరిగిందని గవర్నర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలన్నీ ఒక సమూహంగా ఏర్పడి కేవలం అధికారం కోసమే ప్రభుత్వం ఏర్పాటు అంటూ పాకులాడుతున్నాయని... ఇందులో ఏ ఒక్క పార్టీకి బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్న ఆలోచన ఉన్నట్లు కనిపించడంలేదని గవర్నర్ చెప్పారు.

ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని భావించిన గవర్నర్

ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని భావించిన గవర్నర్

ఎమ్మెల్యేలు చేజారకుండా భారీగా బేరసారాలు జరుగుతున్నాయని అలాంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గవర్నర్ పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి పార్టీ తమకే మెజార్టీ ఉందని చెప్పుకుంటున్నాయని ఇలాంటి పరిస్థితిలో దీర్ఘకాలంలో ప్రభుత్వం స్థిరంగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ గవర్నర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేసి సరైన సమయంలో ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని గవర్నర్ భావించినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికలు జరిగాక ఏ పార్టీ అయితే పూర్తి మెజార్టీతో గెలుస్తుందో అంటే ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన సంఖ్యాబలం కలిగి ఉంటుందో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జమ్మూ కశ్మీర్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని గవర్నర్ భావించినట్లు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

English summary
Jammu and Kashmir Governor Satya Pal Malik dissolved the Assembly with immediate effect considering four main aspects, including "extensive horse-trading" and the "impossibility" of forming a stable government by coming together of political parties with "opposing political ideologies", the Raj Bhavan said in a statement Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X