కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే ? తెలుగు రాష్ట్రాల్లో మారిపోనున్న పొత్తుల సీన్ !

కర్నాటకలో మే 10న జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో గత ఏడాది కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికను సెమీ ఫైనల్ గా చెప్పుకుంటూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు కర్నాటకలో గెలుపు అత్యవసరంగా మారింది. అసలే దేశవ్యాప్తంగా విపక్షాలు ఉమ్మడి ప్రత్యామ్నాయంగా తెరపైకి
వస్తున్న వేళ కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ప్రభావం దక్షిణాదిలోని చాలా రాష్ట్రాలపై పడబోతోంది.

ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తెలుగు రాష్ట్రాల్లో సమీకరణాల్ని సమూలంగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కర్నాటకలో అధికార బీజేపీ, విపక్షకాంగ్రెస్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఈ పోరులో కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి రాబోతున్నట్లు పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికార, అనధికార మిత్రులుగా ఉన్నవారంతా అలర్ట్ అయ్యారు. అలాగే కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని భావిస్తున్న పార్టీలు కూడా అప్రమత్తం అయ్యాయి. వీరంతా వేచి చూసే ధోరణిలోకి వెళ్లిపోయారు.

karnataka poll results decide tie-ups in telugu states

ఏపీలో చూసుకుంటే బీజేపీతో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు ప్రధాన విపక్షం టీడీపీ అనధికార మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. జనసేన ఎలాగో అధికారికంగానే మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో బీజేపీకి అధికారికంగా దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ఫలితాలు తేడా వస్తే మాత్రం టీడీపీ సైలెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. బీజేపీ గెలిస్తే మాత్రం ఈ పొత్తు ప్రయత్నాలు మరింత తీవ్రం చేయొచ్చు. అలాగే వైసీపీ కూడా కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీపై రాష్ట్రంలో దాడి ముమ్మరం చేయొచ్చు.అలాగే బీజేపీ కూడా ఏపీలో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కోసం ప్రయత్నించడం ఖాయం.

మరోవైపు తెలంగాణలో బీజేపీతో ప్రస్తుతం ఏ పార్టీకి పొత్తు లేదు. కానీ వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ ఇప్పుడు బీజేపీకి బీ-టీమ్ అన్న పేరు తెచ్చుకుంది. అలాగే టీడీపీ కూడా బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు కర్నాటకలో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే మాత్రం షర్మిల కాంగ్రెస్ తలుపు తట్టడం ఖాయం. అలాగే టీడీపీ కూడా వీరితో పాటు పొత్తు పెట్టుకుని తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పొత్తు రాజకీయాల్ని డిసైడ్ చేయబోతున్న కర్నాటక ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడి పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+