మూడోసారైనా యడ్యూరప్ప సీఎం పదవిలో పూర్తి కాలం కొనసాగుతారా?
Recommended Video

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప మే 17వ తేదినప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీ యడ్యూరప్ప బలనిరూపణను మే 19వ తేదిన చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గతంలో రెండు దఫాలు కూడ యడ్యూరప్ప మధ్యంతరంగానే పదవులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే తాజాగా జరిగే బలపరీక్షలో యడ్యూరప్ప భవితవ్యం తేలనుంది.
కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపికి 104 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కు 78, జెడి(ఎస్)కు 38 సీట్లు దక్కాయి. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజారిటీకి సుమారు 8 ఓట్ల దూరంలో బిజెపి ఉంది.

అయితే గవర్నర్ వాజ్‌భాయ్ వాలా బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దీంతో యడ్యూరప్ప మే 17వ తేదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 19 వ తేది సాయంత్రం నాలుగు గంటలకు విశ్వాస పరీక్ష జరగనుంది.ఈ విశ్వాస పరీక్షపై అందరి కళ్ళు ఉన్నాయి.
2007 నవంబర్ 12న కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టారు. అప్పట్లో జేడీఎస్ సహకారంతో ఆయన సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు. కాని జేడీఎస్ మద్దతుకు అంగీకరించకపోవడంతో కేవలం వారం రోజులకే పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2008 శాసనసభ ఎన్నికల్లో షికారిపుర నుంచి మరోసారి 45వ ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
అక్రమ మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తూ కర్ణాటక లోకాయుక్త సీఎం యడ్యూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి మే రకు 2011 జులై 31న ఆయన రాజీనామా చేశారు. ఇలా రెండు దఫాలు యడ్యూరప్ప సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది. కనీస మెజార్టీ లేకున్నా గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇవాళ జరిగే విశ్వాస పరీక్షలో ఏం జరుగుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దేశ వ్యాప్తంగా అందరి కళ్ళు కర్ణాటకలో జరిగే బలపరీక్షపైనే ఉన్నాయి. కర్ణాటకలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాలపై కూడ ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే బీహర్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బిజెపియేతర పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్లను కోరారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications