year ender 2024: ఈ ఏడాది కొత్త జంటల మనసు దోచిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవే!

పెళ్లి జీవితంలో ఒకేసారి జరిగే అద్భుతమైన వేడుక. ఈ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం పైన ప్రస్తుతం ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ పెరిగింది. సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం పైనే మొగ్గు చూపుతున్నారు.

2024 సంవత్సరంలో ఆకట్టుకున్న డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రదేశాలు దీనికోసం మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను ఎంపిక చేసుకొని అక్కడ తమ అరుదైన పెళ్లి వేడుకను అద్భుతంగా చేసుకుంటున్నారు. 2024 సంవత్సరంలో మన దేశంలోని పలు వెడ్డింగ్ డెస్టినేషన్లు విపరీతమైన ప్రజాదరణను పొందాయి. మరి ఆ వెడ్డింగ్ డెస్టినేషన్ ల గురించి తెలుసుకుందాం.

year ender 2024 These are the indian wedding destinations that captivated the hearts of newlyweds this year

ఉదయపూర్
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ వెడ్డింగ్ డెస్టినేషన్ల జాబితాలో 2024 సంవత్సరంలో ప్రథమ స్థానంలో నిలిచింది . చాలా హుందాను, దర్పాన్ని ప్రదర్శించేలా రాచరిక వివాహాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలోని శిల్పకళా సౌందర్యం, ప్రశాంతమైన సరస్సులు ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు మధురానుభూతులు మిగిల్చాయి. ఈ క్రమంలోనే వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్లలో ఉదయపూర్ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.

పుష్కర్
రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ స్పాట్. రాచరిక వివాహాలకు పెట్టింది పేరుగా ఉండే అద్భుతమైన వారసత్వ భవనాలతో పుష్కర్ బాగ్ ప్యాలెస్, రోజ్ గార్డెన్, వెస్టిన్ రిసార్ట్ తదితర సుందర ప్రదేశాలతో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇది కేంద్రంగా మారింది.

జై సల్మేర్
డెస్టినేషన్ వెడ్డింగ్ లకు మూడవ స్థానంలో నిలిచింది జై సల్మేర్. ఇది కూడా రాజస్థాన్లోని ప్రాంతమే.. బంగారం రంగులో ఉండే ఇసుక దిబ్బలతో రాచరికం ఉట్టిపడే ఐకానిక్ సూర్యగఢ్ జై సల్మేర్ కు ప్రత్యేకతను ఇచ్చింది. ఇక్కడ కూడా ఈ సంవత్సరం డెస్టినేషన్ వెడ్డింగ్స్ చాలా ఘనంగా జరిగాయి.

కేరళ
సుందరమైన ప్రకృతి ప్రదేశాలతో చుట్టూ పచ్చదనం, ప్రశాంతత కలిగించే బీచ్ లు కేరళలో పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. దీంతో 2024 సంవత్సరంలో కేరళలోని కుమరకొమ్ బీచ్, చరాయ్ బీచ్ లు మంచి వెడ్డింగ్ డెస్టినేషన్స్ గా నిలిచాయి.

గోవా
సుందరమైన బీచ్ లతో సముద్రపు సోయగాలతో బీచ్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారికి మంచి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్ గోవా. గోవాలో విలాసవంతమైన రిసార్ట్స్ ఉన్నాయి. బీచ్ సైడ్ వేడుకలు చేసుకోనే వారికి గోవా సుందర ప్రదేశం కాగా 2024 సంవత్సరంలో గోవాలో భారీగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి.

సిమ్లా
సిమ్లాలోని ఆహ్లాదం కలిగించే వాతావరణం, అందమైన కట్టడాల సౌందర్యం, మంచుతో కప్పబడి సుందరంగా కనిపించే పర్వత శ్రేణి డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలని భావించే వారికి చాలా మంచి ప్రదేశం. 2024 సంవత్సరంలో సిమ్లాలోని విలాసవంతమైన అనేక రిసార్ట్ లు బోలెడన్ని వివాహ వేడుకలకు వేదికగా నిలిచాయి.

మాండు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాండూ కూడా వివాహం చేసుకోవాలనుకునే వారికి డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్. అందమైన కట్టడాలతో పురాతన కాలం నాటి అద్భుతమైన పనితనంతో కనిపించే నగరంలో 2024 సంవత్సరంలో చాలా వివాహ వేడుకలు జరిగాయి. హిల్ స్టేషన్ కావడంతో మాండూ తన అపురూప ప్రకృతి సౌందర్యంతో కొత్తగా పెళ్లి చేసుకునే జంటల మనసులను మాండూ ఆకట్టుకుంటుంది.

జైపూర్
రాజస్థాన్లోని జైపూర్ కూడా వివాహాది వేడుకలకు మంచి డెస్టినేషన్ పాయింట్ గా మారింది. రాజస్థాన్లోని పింక్ సిటీ అయిన జైపూర్ అద్భుతమైన రాజభవనాలతో, విలక్షణమైన సంస్కృతి సాంప్రదాయాలతో అక్కడ వివాహం చేసుకోవాలనుకునే వారి మనసులను ఆకట్టుకుంటుంది. 2024 సంవత్సరంలో జైపూర్ లోనూ బ్రహ్మాండంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+