year ender 2024: భారతదేశంలో ఈ ఏడాది టాప్ 10 గూగుల్ సెర్చ్ లు ఇవే!

2024సంవత్సరం మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతుంది. 2025 సంవత్సరం రాబోతోంది. 2024సంవత్సరంలో భారత దేశ వ్యాప్తంగా అనేక అంశాలు మనలో ఆసక్తిని రేకెత్తించాయి. ఇక అటువంటి అంశాలు భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసినవి ఉన్నాయి. 2024లో గూగుల్లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన ఆ అంశాలు ఏమిటి? ఏ విషయంపైన భారతీయులు ఎక్కువగా గూగుల్ లో శోధించారు? టాప్ టెన్ లో నిలిచిన గూగుల్ సెర్చ్ టాపిక్స్ ఏమిటి? తెలుసుకుందాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్
గూగుల్ లో 2024 సంవత్సరంలో ఎక్కువగా సెర్చ్ చేసిన టాపిక్స్ లో మొదటి స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది. గూగుల్ సెర్చ్ లో ఐపీఎల్ టాప్ స్థానంలో నిలిచింది. క్రికెట్ అభిమానులు టీమ్స్ గురించి, ప్లేయర్ల గురించి, వేలం పాటల గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసారు.

year ender 2024 These are the top 10 Google searches in India this year

టి20 వరల్డ్ కప్
ఐపీఎల్ తర్వాత ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో రెండవ స్థానంలో టి20 ప్రపంచ కప్ నిలిచింది. ఎప్పటికప్పుడు ఈ వరల్డ్ కప్ కి సంబంధించి స్కోర్ అప్డేట్లు, ఆట తీరు ఆటకు సంబంధించిన ప్రిడిక్షన్ గురించి ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేశారు.

బిజెపి
ఆ తర్వాత స్థానంలో బిజెపి నిలిచింది. ఈ సంవత్సరం లోక్సభ ఎన్నికలు జరగడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లోని బీజేపీ మరోసారి అధికారంలోకి రావడంతో బిజెపి గురించి ఎక్కువగా ఇండియన్స్ సెర్చ్ చేశారు. బిజెపి విధానాలు ఎన్నికల వ్యూహాలు నాయకుల ప్రకటనల గురించి ఎక్కువగా గూగుల్ లో శోధించారు.

2024 ఎన్నికల ఫలితాలు
ఆ తర్వాత స్థానంలో 2024 ఎన్నికల ఫలితాలు నిలిచాయి. 2024 ఎన్నికలలో ఏ స్థానంలో ఏ పార్టీ వారు గెలిచారు వంటి వాటిని ఎక్కువ మంది సెర్చ్ చేసారు.

ఒలంపిక్స్ 2024
ఇక google సెర్చ్ లో ఐదవ స్థానంలో 2024 ఒలింపిక్స్ నిలిచింది. 2024 ఒలంపిక్స్ గురించి భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసారు. ముఖ్యంగా భారతీయ అథ్లెట్ లు అయిన వినేష్ ఫోగట్ నుండి నీరజ్ చోప్రా వరకు క్రీడాకారులపైన భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసారు.

హీట్ వేవ్
2024 సంవత్సరంలో హీట్ వేవ్ గురించి చాలామంది నెటిజెన్లు వెతకగా ఈ టాపిక్ ఆరవ స్థానంలో నిలిచింది. భారతీయులు మన దేశంలోని ఉష్ణోగ్రతల వివరాలను ఎప్పటికప్పుడు గూగుల్ ద్వారా తెలుసుకున్నారు. వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందడానికి చల్లగా ఉండడానికి పాటించవలసిన చిట్కాల గురించి ఆన్లైన్లో శోధించారు.

రతన్ టాటా
భారతీయ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో ఆయన గురించి ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు. ఆయన మరణానంతరం టాటా వ్యాపారాలు, గతంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి చాలామంది వెతికారు. ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్
దేశంలో ప్రధాని ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి ఈ సంవత్సరం చాలామంది గూగుల్ లో సెర్చ్ చేసారు. దీంతో ఎనిమిదవ స్థానంలో google సెర్చ్ లో కాంగ్రెస్ నిలిచింది. 2024 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విధానాలు, ఎన్నికల వ్యూహాలు, పార్టీ నాయకత్వం గురించి ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేశారు.

ప్రో కబడ్డీ
2024 సంవత్సరంలో ప్రో కబడ్డీ లీగ్ కూడా గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయబడింది. క్రీడాభిమానులు అధికంగా ప్రో కబడ్డీ లీగ్స్ పైన గూగుల్ వేదికగా తెలుసుకున్నారు. ప్రో కబడ్డీ లీగ్ టీమ్స్ ఆటగాళ్లు, మ్యాచ్ షెడ్యూల్ గురించి ఎక్కువగా శోధించారు.

ఇండియన్ సూపర్ లీగ్
భారతదేశంలో ఫుట్ బాల్ కి పెరుగుతున్న ఆదరణకు ప్రతీకగా ఇండియన్ సూపర్ లీగ్ పైన ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ గురించి అభిమానులు సెర్చ్ చేయడంతో ఇది పదవ స్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+