యడ్యూరప్ప సంచలనం .. సర్జికల్ స్ట్రైక్ తో కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో 22 స్థానాలు
కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులతో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాజిటివ్ వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 స్థానాల్లో 22 స్థానాల్లో బిజెపి విజయకేతనం ఎగర వేస్తుందని చెప్పారు.
పాకిస్థాన్ లో ఉగ్రవాదులు శిబిరాలపై భారతదేశం సర్జికల్ స్ట్రైక్ చేసి వేసిన ముందడుగు కారణంగా భారత ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి ఎస్ యడ్యూరప్ప తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో లోక్సభ ఎన్నికలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిబిరాలపై దాడులు చేసి ప్రధాని నరేంద్ర మోడీ ఒక పాజిటివ్ వేవ్ సృష్టించారని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోకసభ స్థానాలలో ఇరవై రెండు స్థానాలలో బిజెపి విజయకేతనం ఎగరవేయడానికి ఈ ముందడుగు ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేశారని ఆయన పేర్కొన్నారు.

చిత్రదుర్గ లో విలేకరులతో మాట్లాడిన ఆయన పాకిస్తాన్ భూభాగం లోకి ప్రవేశించి భారత ప్రభుత్వం మూడు తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని, దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలను ఇది తెచ్చిపెట్టిందని, దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో తప్పక ఉంటుందని యడ్యూరప్ప పేర్కొన్నారు. తాజాగా యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడుల లో 40 మంది భారత సైన్యాన్ని కోల్పోయిన భారతదేశం ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానిని రాజకీయాలతో లింకు పెట్టడం సమంజసం కాదనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications