శ్రీలంకలో రామాయణ కట్టడాల అభివృద్ధికి యూపీ సర్కార్ సాయం-రాయబారితో యోగీ చర్చలు..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల్ని పరుగులు పెట్టిస్తున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆధ్యాత్మిక పర్యాటకానికి అంతే స్ధాయిలో పెద్దపీట వేస్తోంది. ఇదే క్రమంలో దేశ విదేశాల నుంచి భారతీయ మూలాలున్న వ్యక్తుల్ని, నీరు, మట్టిని తెప్పించి పూజలు, యాగాలు కూడా చేయిస్తోంది. ఇప్పుడు ఏకంగా విదేశాల్లో భారతీయ జ్ఞాపకాల్ని పదిలం చేసేందుకు కొత్త వ్యూహం సిద్దం చేసింది.
భారత్ లో శ్రీలంక హైకమిషనర్ అశోక్ మిలింద తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన వీరిద్దరి భేటీలో శ్రీలంకతో యూపీని అనుసంధానించేలా, ఇరు ప్రాంతాల మధ్య ఆథ్యాత్మిక సంబంధాలు పెంచే విధంగా చర్చించారు. ముఖ్యంగా శ్రీలంకలో రామాయణ కాలం నాటి కట్టడాలు, స్ధలాల అభివృద్ధి చేసేందుకు యూపీ సీఎం ప్రతిపాదించారు. దీనికి లంక హైకమిషనర్ అశోక్ కూడా సానుకూలంగా స్పందించారు.

ఒకప్పుడు భరత ఖండంలో భాగంగా చెప్పుకునే ప్రస్తుత శ్రీలంకలో రామాయణ కాలం నాటి స్ధలాలు,కట్టడాలు చాలానే ఉన్నాయి. అయితే పేదరికంతో కునారిల్లుతున్న లంకకు వాటిని అభివృద్ధి చేసే పరిస్ధితి లేదు. దీంతో యూపీ సర్కార్ తానే ముందుకొచ్చి వీటిని అభివృద్ధిచేస్తామని ప్రతిపాదిస్తోంది. దీనికి ప్రతిగా అప్పటి కాలం నాటి సంజీవని చెట్లను భారీ ఎత్తున యూపీకి పంపేలా రాయబారికి యోగీ ఆదిత్యనాథ్ ప్రతిపాదించారు.
అలాగే శ్రీలంకలో రామాయణ కాలం నాటి ఆథ్యాత్మిక స్ధలాల్ని అభివృద్ధి చేస్తున్నందున ఆ తర్వాత యూపీ నుంచి వచ్చే భక్తుల్ని విరివిగా అక్కడ పర్యటించేందుకు అనుమతించేలా యోగీ, అశోక్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగీ నుంచి వచ్చిన ప్రతిపాదనల్ని హైకమిషనర్ అశోక ప్రశంసించారు. యూపీ అభివృద్ధికి యోగీ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications