Yogi Adityanath : మీకోసం యముడి వెయిటింగ్- వారికి యోగీ ఆదిత్యనాథ్ స్వీట్ వార్నింగ్..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాక నేరస్తులపై మరింత దూకుడుగా చర్యలకు దిగుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నట్లుండి ఆశ్చర్యకరంగా వేదాంత ధోరణిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇన్నాళ్లూ ఎన్ కౌంటర్లు, బుల్ డోజర్ యాక్షన్లతో నేరస్తులకు చుక్కలు చూపిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. ఈసారి మాత్రం అదే నేరస్తులకు వేదాంత ధోరణిలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో యోగీ కామెంట్స్ పై చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?.. యూపీలో ఈ మధ్య ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నారు. వారిపై మరీ క్రిమినల్ చర్యలు చేపట్టే పరిస్ధితి లేదు. దీంతో వారికి వేదాంత ధోరణిలో యోగీ ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వార్నింగ్ లో యోగీ చేసిన ప్రస్తావనపైనా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో మహిళల్ని వేధిస్తున్న ఈవ్ టీజర్లను హెచ్చరిస్తూ.. యముడు మీ కోసం ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎవరైనా మహిళలను వేధించడం వంటి నేరానికి పాల్పడితే యముడు వారి కోసం వేచి ఉంటాడని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. రాష్ట్రంలోని అంబేద్కర్‌నగర్‌లో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ యువతి దుపట్టాను లాగే ప్రయత్నంలో ఆమె సైకిల్‌పై నుండి పడిపోవడం, మరొక మోటార్‌సైకిల్ ఆమెపైకి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. శనివారం రాత్రి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం కస్టడీ నుంచి పారిపోయే ప్రయత్నంలో ఇద్దరు నిందితులకు బుల్లెట్ గాయాలు కాగా, ఒకరికి కాలు ఫ్రాక్చర్ అయినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో మహిళలను వేధించడం లాంటి నేరానికి ఎవరైనా పాల్పడితే మృత్యుదేవత యమరాజు వారి కోసం ఎదురుచూస్తాడని యోగీ హెచ్చరించరాు. జిల్లాలో రూ.343 కోట్లతో 76 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications