కాంగ్రెస్ తరిమికొట్టండి , పేదరికాన్ని పారదోలండి : మోడీ
పేదరికాన్ని పారదోలడానికి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అంటూ ప్రధాని నరేంద్ర మోడి కోత్త నినాదాన్ని ఇచ్చారు. మహరాష్ట్రలోని అహ్మద్ నగర్ లో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గోని ప్రసంగించారు. ఈనేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.పేదరికాన్ని పారదోలడానికి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి.

ప్రచారంలో స్పీడు పెంచిన మోడీ
రెండో దఫా ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి దూకుడును పెంచారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ పై ఆయన విమర్శల బాణాలను ఎక్కుపెట్టాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకువచ్చింది.దీంతో రాహుల్ గాంధి బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేస్తే ,తాము పేదరికాన్ని పారదోలేందుకు పేదరికం సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నామని స్కీంపై విపరీత ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రధాని మోడి కాంగ్రెస్ కోత్త నినాదం ఇచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే ముందు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టండి ప్రజలకు పిలుపునిచ్చారు.

చౌకిదార్ కావాలా అవినీతిపరుడు కావాలా ?
ప్రపంచం బీజేపీ ప్రభుత్వం బలమైందని గుర్తించింది భవిష్యత్ ఏమిటనేది ఈ ఎన్నికల్లో మీరు నిర్ణయించబోతున్నారంటూ మోడి అన్నారు. ఈనేపథ్యంలోనే మీకు నిజాయితీ పరుడైనా చౌకిదార్ కావాలో ,అవినీతి పరుడైన నామ్ దార్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు.కాగా ప్రజలు హిందుస్తాన్ హీరోలకు ఓటు వేయాలో , లేదా పాకిస్థాన్ మద్దతుదారులకు ఓటు వేస్తారో తేల్చుకోండని అన్నారు.

కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ప్రభత్వం
గత అయిదు సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారని ,అంతకు ముందు రిమోట్ కంట్రోల్ తో నడిచే ప్రభుత్వం ఉండేదని అన్నారు.కాగా కాంగ్రెస్ హయాంలో రోజుకో కుంభకోణం గురించి వార్తలు వచ్చేవి అని మోది కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడ్డారు.

ఏల్ఓసీ వెంట దాడులు చేయడానికి కాంగ్రెస్ అనుతివ్వలేదు.
కాగా బాలకోట్ దాడులను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఉండే ఉగ్రవాద స్తావరాల మీద దాడులు చేయడానికి అప్పటి యూపిఏ ప్రభుత్వం అనుమతివ్వలేదని అరోపించారు. ఈనేపథ్యంలోనే జమ్ము కాశ్మీర్ ను భారత్ నుండి వేరు చేయాలని చూసే కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని కోరుకునే పార్టీలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కాగా నాకు కాంగ్రెస్ పార్టీ మీద నాకు నమ్మకం లేదు కాని ఛత్రపతి శివాజీ లాంటీ లెజండరీ జన్మించిన భూమి మీద జన్మించిన శరద్ పవార్ కు ఏమైందని అన్నారు. ఆయన ఇంకెంతకాలం మౌనంగా ఉంటారని అన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications