• search

సంచలనం: 'గాలి' బేరసారాల ఆడియో లీక్!, ద్రోహం చేయలేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   ద్రోహం చేయలేనన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే : షాక్ కు గురైన 'గాలి'

   బెంగళూరు: రేపు సాయంత్రం 4.30గం.కి బీజేపీ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సిన నేపథ్యంలో.. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ బేరసారాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ సంచలన ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది.బెంగళూరులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2నిమిషాల 41సెకన్ల నిడివి గల ఆడియో టేపును కాంగ్రెస్ బయటపెట్టింది.

   you will be 100times richer: janaradhana reddy to cong MLA

    ఆడియో టేపులో మైనింగ్ కింగ్, మాజీ బీజేపీ మంత్రి గాలి జనార్దన రెడ్డి రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసవనగౌడకి భారీ ఎత్తున డబ్బు ఆఫర్ చేసినట్టుగా సంభాషణ రికార్డయింది. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే గాలి జనార్దన్ రెడ్డి ఈ చర్యకు పూనుకున్నారని, సంభాషణల్లో ఆ పార్టీ 'జాతీయ అధ్యక్షుడి' గురించి కూడా ప్రస్తావించారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

   ఆడియో సంభాషణను గమనించినట్టయితే.. బసవనగౌడకు తొలుత ఓ వ్యక్తి ఫోన్ చేసి 'జనార్దన్ సార్ తో మాట్లాడటానికి మీరు ఫ్రీగా ఉన్నారా?' అని ఆరా తీశారు. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి లైన్ లోకి వచ్చారు.

   ఆడియో టేపు సంభాషణ యథావిధిగా:

   బసవనగౌడ: ఎస్, చెప్పండి..

   జనార్దన రెడ్డి: మాట్లాడటానికి ఫ్రీగా ఉన్నారా?

   బసవనగౌడ: అవును, ఫ్రీగానే ఉన్నా

   జనార్దనరెడ్డి: ఇంతకుముందు జరిగిందంతా మరిచిపోండి. ప్రతికూల సంగతులన్ని మరిచిపోండి. నాకిప్పుడు మంచి టైమ్ స్టార్ట్ అయింది. చాలా పెద్ద మనుషులు, జాతీయ అధ్యక్షుడు మీతో కూర్చొని మాట్లాడుతారు..

   మీకే పదవి కావాలో, అసలు మీకేం కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి. ఆ తర్వాత మా పని మేం చేస్తాం.

   బసవనగౌడ: లేదు సార్, వాళ్లు చాలా శ్రమించి నన్ను ఎమ్మెల్యేను చేశారు. నా చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు.

   బసవనగౌడ: నేను నీకొక విషయం చెప్పబోతున్నా. మేము ఇంతకుముందు బీఎస్ఆర్ పార్టీని స్థాపించాం. ఆ సమయంలో మా టైమ్ చాలా బ్యాడ్ గా ఉంది. పరిస్థితులు కూడా మాకు అప్పుడు మాకు అనుకూలంగా లేవు. నాకు తెలుసు నీవు నమ్మకం కోల్పోయావు, కానీ నేను నీకు భరోసా ఇస్తున్నా.. ఇప్పుడున్న దానికంటే 100రెట్లు ఎదుగుతావు.

   శివగౌడ నాయక్, నేను చెప్పినట్టు విని వచ్చాడు, ఆయన మంత్రి అయ్యాడు. ఈరోజు తనకు తానుగా ఎమ్మెల్యేగా అయ్యే సత్తా సంపాదించాడు. ఆ స్థాయికి అతను ఎదిగాడు, శక్తివంతంగా తయారయ్యాడు. అంతా నాకోసమే. రాజుగౌడ కూడా అలాగే వచ్చాడు.

   బసవనగౌడ: అవునా!

   జనార్దనరెడ్డి: ఇది బ్యాడ్ టైమ్, అందుకే వర్కౌట్ కాలేదు. కానీ ఈరోజు శివన్ గౌడ నాయక్ గెలిచాడు. కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు, నువ్వు కూడా మంత్రి అవుతావు. అర్థమైందామ్మా!

   బసవనగౌడ: హ..

   జనార్దనరెడ్డి: నేను చెప్పేదేంటంటే.. నిన్ను తీసుకెళ్లి బీజేపీ హైకమాండ్ ముందు కూర్చోబెడుతా, వాళ్లే నీతో మాట్లాడుతారు. దేశంలో ప్రస్తుతం వారే అధికారంలో ఉన్నారు. ఇప్పటిదాకా నువ్వు సంపాదించిన దానికంటే 100రెట్లు ఎక్కువ పొందుతావు, దానికి నాది భరోసా.

   బసవనగౌడ: సారీ సార్, వాళ్లు నన్ను చాలా కష్టపడి గెలిపించారు. నేను మిమ్మల్ని గౌరవిస్తాను కానీ ఇలాంటి స్థితిలో వాళ్లకు నేను ద్రోహం చేయలేను.

   మాజీ సీఎం సిద్దరామయ్య మీడియా సమావేశంలో రిపోర్టుల ముందు ఈ ఆడియో టేపును బయటపెట్టారు. 'ఇందులో ఎవరు ఎవరితో మాట్లాడరన్నది మనందరికీ తెలుసు. ఏ రెడ్డి ఎవరితో మాట్లాడారో.. శ్రీరాములు ఎవరితో మాట్లాడారో!.. రేపటి బలనిరూపణ తర్వాత మేము పూర్తి వివరాలు బయటపెడుతాం' అని సిద్దరామయ్య అన్నారు.

   గాలిపై కేసు నమోదు:

   రాయచూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడను కోట్ల రూపాయల డబ్బు ఆశచూపి ప్రలోభ పెట్టినందుకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) బీజేపీ గాలి జనార్దన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Hours to go for the crucial trust vote in the Karnataka assembly and the Congress has released an explosive audio clip to prove their allegation of horse-trading by the BJP. The party in a press meeting in Bengaluru on Friday evening released a 2 minute 41 second audio clip, and alleged that it had the voice of mining baron and former BJP minister Janardhana Reddy can be heard speaking to Congress Raichur Rural MLA-elect Basavanagouda Daddal.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more