వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రావణమాసం ఎఫెక్ట్: పోర్క్,బీఫ్ మాంసాన్ని సప్లై చేయం : జోమాటో ఉద్యోగుల స్ట్రైక్

|
Google Oneindia TeluguNews

ఫుడ్ సర్వీస్ ఆప్ జొమాటో మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే నాన్‌వేజ్ ఫుడ్ సర్వీసుకు సంబంధించి పలు వివాదాలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే... శ్రావణమాసం కావడవంతో నాన్ హిందు ఎక్జిక్యూటివ్ తెచ్చిన ఫుడ్ ఓ హిందు వినియోగదారుడు వాపసు పంపిణ విషయం తెలిసిందే.... అయితే ఇప్పుడు ఏకంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా గోడ్డు,పంది మాంసాన్ని సప్లై చేయిస్తున్నారని కొల్‌కతా డెలివరి ఎక్జిక్యూటివ్స్ ఆందోళన బాట పట్టారు. దీంతో విధులు బహిష్కరించి సమ్మేకు దిగేందుకు సిద్దమయ్యారు.

మరో వివాదంలో చిక్కుకున్న జొమాటో

మరో వివాదంలో చిక్కుకున్న జొమాటో

అత్యంత ఫుడ్ సర్వీసు ప్రోవైడర్‌గా పాపులర్ అయిన జొమాటో ఇప్పుడు అంతే త్వరగా వివాదాల్లో చిక్కుకుంటుంది. ఫుడ్ సర్వీసులో కూడ కుల మతాలు, సంప్రాదాయాలు జోమాటోను ఇరకాటంలో పెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం శ్రావణ మాసం కావడంతో తనకు నాన్ హిందు ఫుడ్ డెలివరి ఎక్జిక్యూటివ్ ఫుడ్‌ను వ్యతిరేకించిన విషయం తెలిసిందే... దీంతో ఆ విషయం సంచలనం రేగింది. ఫుడ్ సప్లై కులమతాలు పాటించమని సంస్థ ఖరాఖండిగా సదరు వినియోగదారుడికి తేల్చి చెప్పింది.

కోల్‌కతాలో ఏకమైన హిందూ,ముస్లిం డెలివరీ బాయ్స్...

కోల్‌కతాలో ఏకమైన హిందూ,ముస్లిం డెలివరీ బాయ్స్...

అయితే ఇప్పుడు ఆ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని వినియోగదారులు కాకుండా ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా కోల్‌కతా డెలివరీ ఎక్జిక్యూటివ్స్ ఏకమయ్యారు. జోమాటో పాలసీ వ్యతిరేకంగా వారు ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా డెలివరి ఎక్జిక్యూటివ్‌తో బలవంతంగా ఫోర్క్‌తో పాటు బీఫ్ మాంసాన్ని డెలివరి చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇది తమ మతాల ఇష్టాలకు వ్యతిరేకమని ఆందోళన చెందుతున్నారు. దీంతో దీన్ని వ్యతిరేకించేందుకు సిద్దమయ్యారు. సంస్థలో పనిచేసే హిందు ముస్లిం డెలివరి ఎక్జిక్యూటీవ్స్ కలిసి జోమాటో నోటీసులు పంపారు.

ఉద్యోగులకు మద్దతు పలుకుతున్న స్థానిక నేతలు

ఉద్యోగులకు మద్దతు పలుకుతున్న స్థానిక నేతలు

జోమాటో తమ ఫుడ్ డెలివరీ పాలసీని పున:సమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యలోనే పలు రెస్టారెంట్స్ నుండి ఫుడ్ డెలివరి ఇచ్చేందుకు ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్న ఎక్జిక్యూటివ్స్ సోమవారం నుండి స్ట్రైక్‌ను ప్రకటించారు. ఇక ఉద్యోగులకు స్థానిక టీఎంసీ నేతలు కూడ మద్దతు పలుకుతున్నారు. జొమాటో, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల మనోభావాలను కాపాడాలి కోరుతున్నారు.

English summary
delivery executives of Zomato in Howrah, West Bengal go on indefinite strike, Both Hindu and Muslim delivery executives are protesting against the delivery policy of Zomato.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X