వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాకింగ్, బిల్‌గేట్స్ కంటే 12ఏళ్ల బాలికకి ఎక్కువ స్కోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: మెన్సా ఐక్యూ టెస్ట్‌లో 12 ఏళ్ల బాలిక 162 స్కోర్ సాధించి సంచలనం సృష్టించింది. ఆ బాలిక పేరు నికోల్ బార్. ఆమె ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.

162 స్కోర్ సాధించడం ద్వారా అల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వంటి వారిని దాటింది. వారి కంటే కూడా అధిక మేధో సంపత్తి కలిగిన వ్యక్తిగా పేర్కొనగలిగిన ప్రతిభను నికోల్ బార్ కనబరిచింది. హాకింగ్, బిల్ క్లింటన్, ఐన్ స్టీన్‌లకు ఐక్యూ టెస్టులో 160 స్కోర్ ఉంది.

12 yr old gets highest IQ score of 162

తమ కూతురు నికోల్ బార్ చాలా కష్టపడి చదువుకుంటోందని, ఒక్కరోజు కూడా పాఠశాల మానేయడానికి ఇష్టపడదని, పాఠశాలల వేళలు అయిపోయాక కూడా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది, చిన్నప్పటి నుంచి అంతేనని నికోల్ తల్లిదండ్రులు చెప్పారు.

తనకు అత్యధిక స్కోర్ రావడం చూసి ఆనందం ఉందని నికోల్ చెప్పింది. దీనిని తాను ఊహించలేదని, తనకు 162 స్కోర్ వచ్చిందని తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని నికోల్ బార్ చెప్పింది.

English summary
A 12 year old girl in the UK has achieved the highest possible score of 162 on a Mensa IQ test, which could make her brainier than Albert Einstein and Stephen Hawking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X