అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 18 మంది మృతి
కాబూల్: నూతన సంవత్సరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఆఫ్ఘానిస్తాన్‌లో ఘోరం సంభవించింది. ఉగ్రవాదులు చేసిన దాడిలో 18 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు.
ఆదివారం జరిగిన మానవ బాంబుదాడిలో 18 మంది మృత్యువాత పడ్డారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఈదాడి జరిగినట్టు నంగార్హర్ గవర్నర్ అధికార ప్రతినిధి అతుల్లా కోగ్యాని తెలిపారు.

ఈ సంఘటనతో తమకు సంబంధం లేదని తాలిబాన్లు ప్రకటించారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థ అనేది తెలియడం లేదు. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications