ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో 40 మంది తీవ్రవాదులు ? ముట్టడించిన పోలీసులు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై 140 కేసులు మోపిన షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ఆయన్ను అరెస్టు కూడా చేసింది. చివరికి కోర్టులు బెయిల్ ఇవ్వడంతో ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో ఇవాళ ఇమ్రాన్ ఇంట్లో 40 మంది తీవ్రవాదులు దాక్కున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో పంజాబ్ పోలీసులు లాహోర్ లోని ఆయన ఇంటిని చుట్టుముట్టారు.
ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో కనీసం 30-40 మంది ఉగ్రవాదులు ఆశ్రయం పొందారని అనుమానిస్తూ లాహోర్‌లోని మాజీ ప్రధాని జమాన్ పార్క్ నివాసాన్ని పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకుంది. తీవ్రవాదుల్ని తమకు అప్పగించాలని ఇమ్రాన్ పార్టీ పీటీఐని పంజాబ్ పోలీసులు కోరారు. ఉగ్రవాదులు ఇమ్రాన్ ఖాన్ నివాసంలో దాక్కున్నట్లు తమకు నిఘా వర్గాల సమాచారం ఉందని పాక్ మంత్రి అమీర్ మీర్ ప్రకటించారు.

మే 9 తర్వాత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాఖలైన ఏ కేసులోనైనా అరెస్టు చేయకుండా ఉండేందుకు పాక్ సుప్రీంకోర్టు.. తన ఆదేశాలను మే 31 వరకు పొడిగించింది. 70 ఏళ్ల పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ పై దాఖలైన కేసుల గురించి సమాచారాన్ని అందించడానికి ఈ గడువు ఇచ్చింది. ఈ లోపే తీవ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పంజాబ్ పోలీసులు ఇమ్రాన్ ఇంటిని చుట్టుముట్టడం కలకలం రేపుతోంది. ఇమ్రాన్ ను మరోసారి అరెస్టు చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్ పై నమోదు చేసిన పలు కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకు ముందు ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పీఐటీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇమ్రాన్ మాత్రం ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications