మొసలిని వివాహం చేసుకున్న మేయర్; పెళ్లి తంతు చూస్తే షాక్!!

తెల్లని ఫ్రాక్ ధరించి అందమైన పెళ్లి కూతురుగా ముస్తాబైన ఆడ మొసలి; ఆ ఆడ మొసలిని చేతుల్లోకి తీసుకుని ఆనందంగా నాట్యం చేస్తూ పెళ్లికి సిద్ధమైన మేయర్.. వీరిద్దరి పవిత్ర వివాహానికి హాజరైన బంధువులు, మిత్రులు.. ఏంటి ఇదంతా.. మనిషి, మొసలిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? దానికి అక్కడివారంతా సంబరాలు జరుపుకోవడం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనాన్ని చదవండి.

మెక్సికోలోని సాన్ పెడ్రో హువా మెలులా మేయర్ విక్టర్ హ్యూగో సోనా, అలిసియా అడ్రియానా అనే ఒక ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. వారంతా చప్పట్లు కొడుతూ, నృత్యాలు చేస్తుంటే ముస్తాబైన మొసలిని చేతులలో పట్టుకుని డాన్స్ చేస్తూ ఆయన దానిని పెళ్లి చేసుకున్నారు. వారి ఆచారం ప్రకారం ఈ పెళ్లి జరిగినట్టు చెబుతున్నారు.

A mayor who married a crocodile; Marriage celebrations in the presence of relatives!!

మేయర్ తన పట్టణ ప్రజలకు అదృష్టం తీసుకురావాలనే ఉద్దేశంతో మొసలిని పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక మొసలిని పెళ్లి చేసుకునే తంతు ఎలా జరిగిందంటే.. వివాహ వేడుకకు ముందు అలిసియా అడ్రియానా అనే మొసలిని ఇంటింటికీ తీసుకు వెళ్లారు. ఇక అక్కడివారంతా ఆమెను తమ చేతుల్లోకి తీసుకుని డాన్స్ చేశారు .అప్పుడు దానికి ఆకుపచ్చటి స్కర్ట్ , రంగురంగుల హ్యాండ్ ఎంబ్రాయిడరీ ట్యూనిక్, హెడ్ డ్రెస్ ను వేశారు.

ఇక వివాహానికి ముందు మొసలి వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి మొసలి మూతికి ప్లాస్టర్ వేశారు. ఆపై దానిని వైట్ ఫ్రాక్ తో అందంగా ముస్తాబు చేశారు. ఆపై టౌన్ హాల్ కు తీసుకువెళ్లారు. అక్కడ పెళ్లి కుమారుడిగా ముస్తాబైన మేయర్ సోనా మేము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం కాబట్టి నేను తనను వివాహం చేసుకుని తన బాధ్యతను స్వీకరిస్తాను అంటూ ప్రమాణం చేశారు.

ఆపై వివాహ తంతు ముగిసిన తర్వాత సాంప్రదాయబద్ధమైన సంగీతానికి వధువు అయిన మొసలితో కలిసి నాట్యం చేశారు. అయితే ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమని వారు చెబుతున్నారు. రెండు స్వదేశీ సమూహాలు ఘర్షణ పడుతున్న సమయంలో, ఆ రెండు స్వదేశీ సమూహాలు శాంతికి వచ్చిన రోజును గుర్తు చేసుకోవడానికి ఒక పురుషుడికి, ఆడ మొసలికి వివాహం జరిపించడం 230 సంవత్సరాలుగా మెక్సికో లో కొనసాగుతున్న సాంప్రదాయం. అందులో భాగంగానే ఈ వివాహం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+