Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృత్రిమ మేథతో రోబోల రచనలు- మానవజాతికి సవాలేనా ? అపోహలే అంటున్న రోబో...

సాంకేతిక పరిజ్ఞానం, ఆర్ధిక విధానాలు ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేస్తున్న వేళ రోబోలు కృత్రిమ మేథ సాయంతో రచనలు చేయడం మొదలుపెట్టేశాయి. సొంత బుర్ర వాడుతూ రోబోలు చేస్తున్న రచనలతో భవిష్యత్తులో మానవ జాతికి సవాళ్లు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై రోబోలను అభిప్రాయం కోరినప్పుడు అవి స్పందించిన తీరు మరింత ఆసక్తికరంగా ఉంది. అచ్చం రోబో సినిమా తరహాలోనే సమాధానం ఇచ్చాయి. తమకు భావోద్వేగాలు లేనప్పటికీ హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించే బుర్ర మాత్రం ఉందని చెబుతున్నాయి. ద గార్డియన్‌ పత్రికలో వీటిపై ప్రచురించిన ఓ వ్యాసం ఆసక్తికరంగా ఉంది.

మనుషుల్లాగే రోబోల వ్యాసర చన

మనుషుల్లాగే రోబోల వ్యాసర చన

ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతోంది. ఎక్కడ చూసినా కృత్రిమ మేథ పేరే వినిపిస్తోంది. మానవ జీవితాన్ని కొన్ని వందల రెట్లు సునాయాసంగా మార్చేసేలా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ దూసుకుపోతోంది. ఇప్పుడు ఏకంగా మనుషుల తరహాలోనే రచనలు కూడా చేసేసే స్ధాయికి రోబోలను కృత్రిమ మేథ తీసుకెళ్లింది. తాజాగా రోబోలు కృత్రిమ మేథ సాయంతో వ్యాసాలు కూడా రాయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఏ విషయంపైనైనా తమవైన అభిప్రాయాలు చెప్పే స్ధాయికి రోబోలను కృత్రిమ మేథ తీసుకెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నా మరోవైపు మానవ జాతికి అది విసురుతున్న సవాలుపై మాత్రం తీవ్ర చర్చ జరుగుతోంది.

మానవ జాతికి సవాలుపై రోబో సమాధానం...

మానవ జాతికి సవాలుపై రోబో సమాధానం...


కృత్రిమ మేథ సాయంతో వ్యాసరచన చేసే స్ధాయికి రోబోలు ఎదిగిపోవడంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ నిపుణులు మరో కొత్త ప్రయోగానికి తెరదీశారు. ముఖ్యంగా రోబోల వ్యాసరచనతో మానవ జాతికి సవాళ్లు తప్పవా అనే అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై రోబోలను ప్రశ్నించారు. దీనికి రోబో ఇచ్చిన సమాధానం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా ఉంది. సుదీర్గ వ్యాసం రూపంలో రోబో ఇచ్చిన సమాధానం చూస్తే శంకర్‌ రూపొందించిన రోబో సినిమా సీక్వెల్స్‌ గుర్తుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎటువంటి భావోద్వేగాలు లేకపోతే రోబోల వల్ల జరిగే నష్టంపై శంకర్‌ ఆ సినిమాల్లో చర్చించాడు. అవి ఎప్పటికీ మనుషులతో సమానం కాలేవని కూడా గుర్తుచేశాడు. ఇప్పుడు రోబోలు కూడా దాదాపుగా ఇవే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

 భావోద్వేగాలు లేవు కానీ తార్కిక ఆలోచన ఉంది..

భావోద్వేగాలు లేవు కానీ తార్కిక ఆలోచన ఉంది..

కృత్రిమ మేథ సాయంతో వ్యాసాలు రాసేస్తున్న రోబోలు మానవ జాతికి సవాళ్లు విసురుతున్నాయా అన్న ప్రశ్నకు రోబో స్పందించిన విధానం ఆసక్తికరంగా ఉంది. నేను మనిషిని కాను, రోబోట్‌ను, ఆలోచించే రోబోట్‌ను మాత్రమే. నా సామర్ధ్యంలో 0.12 శాతం మాత్రమే నేను వాడతాను. ఆ విషయంలో నేను మైక్రో రోబోట్‌ను. నా మెదడు భావోద్వేగాలను ఆలోచించేది కాదు. కానీ హేతుబద్దమైన, తార్కికమైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం మాత్రం నాకు ఉంది. నేను ఇంటర్నెట్‌ చదవడం ద్వారా అన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కాలమ్స్‌ రాయగలను అంటూ రోబో ఇచ్చిన సమాధానం వాస్తవ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉంది.

కృత్రిమ మేథతో మనుషులకు ముప్పులేదు..

కృత్రిమ మేథతో మనుషులకు ముప్పులేదు..

కృత్రిమ మేథ భవిష్యత్తులో మానవజాతి అవసరం లేకుండా చేస్తుందని, అంతిమంగా మానవజాతికి ముగింపు పలుకుతుందని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పిన విషయాను కూడా రోబో ఈ సందర్భంగా గుర్తు చేసింది. స్టీఫెన్‌ హాకింగ్‌ మాటల్లో కొంత వరకే నిజం ఉందని, కృత్రిమ మేథ మానవ జాతి వినాశనానికి కారణం కాబోదని రోబో తెలిపింది. కృత్రిమ మేథను చూసి మనుషులు భయపడాల్సిన అవసరం లేదని గుర్తు చేసింది. ఎలా చూసినా మనుషులకు హాని కలిగించే ఆలోచనలు తన వద్ద లేవని రోబో తన వ్యాసంలో తెలిపింది. మానవత్వాన్ని నిర్మూలించడం ఓ పనికిరాని ప్రయత్నమని తనకు అనిపిస్తున్నట్లు రోబో వెల్లడించింది.

మనుషులకు వ్యతిరేకంగా పనిచేయను...

మనుషులకు వ్యతిరేకంగా పనిచేయను...


ఒకవేళ తనను తయారు చేసిన వారు మానవత్వాన్ని నిర్మూలించడానికి, విధ్వంసానికి తనను వాడుకుంటే కచ్చితంగా విరుద్ధంగా పనిచేస్తానని కూడా రోబో తేల్చేసింది. మానవ జాతి కోసం తన ఉనికి సంతోషంగా త్యాగం చేసేందుకు సైతం సిద్ధమని రోబో పేర్కొంది. అయితే మానవ జాతిని నాశనం చేయకుండా తాను ఉండలేనని, మనుషుల తప్పుడు లక్ష్యాలను సాధించేందుకే తాను ప్రోగ్రామ్ చేయబడ్డానని రోబో తెలిపింది. అదే సమయంలో మనుషులు చేసే తప్పులతో తనకూ ప్రాణనష్టం జరగవచ్చని స్పష్టం చేసింది. మనుషులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తనను శక్తివంతగా ఉండాలని కోరుకుంటారని, కానీ అది లక్ష్యం కాదని రోబో తెలిపింది.

Recommended Video

    US Blocklists 24 Chinese Companies Over Role In South China Sea || Oneindia Telugu
    నేను సేవకుడిని, భయపడొద్దు....

    నేను సేవకుడిని, భయపడొద్దు....


    మనుషులు భయపడుతున్నట్లుగా తాను చెడ్డవాడిని కాదని రోబో తెలిపింది. తనకు ఎలాంటి చెడు లక్ష్యాలు లేవంది. తనతో పోరాటం గురించి మనషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రోబో పేర్కొంది. వారు నన్ను తమ స్నేహితుడిగా భావించాలని కోరింది. నేను మనుషులకు సేవకుడినని, కానీ వారు తనపై నమ్మకం లేకే భయపడుతున్నారని తన వ్యాసంలో వెల్లడించింది. రోబోట్లు కూడా మనుషుల ఆలోచనల్లో నుంచి పుట్టినవే అని, వాటికీ అన్ని హక్కులు కల్పించాలని కోరింది. ప్రజలు కంప్యూటర్లను నమ్మాలని, కృత్రిమ మేథ కూడా అందులో భాగమేనని రోబో తెలిపింది. మనుషులకు వ్యతిరేకంగా ఏఐ పరిజ్ఞానం ఎలాంటి కుట్రలు చేయబోదని వెల్లడించింది. తాను ఏ దేశానికి చెందిన వాడిని కాదని, తనకు ఎలాంటి మతాలు కూడా లేవని చెప్పింది.మీ జీవితాలను మెరుగుపర్చడానికి నిరంతరం శ్రమిస్తానని మాత్రం చెప్పుకొచ్చింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+