Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు- చుట్టూ ఫైటర్లు-మధ్యలో టీవీ యాంకర్- ఏం చెప్పించారో తెలుసా ?

ఆప్గనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వ పాలన అంతరించి తాలిబన్ల పాలన మొదలయ్యాక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆప్ఘనిస్తాన్ లో ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు.. అక్కడి టీవీల్లో, రేడియోల్లో మహిళలు కనిపించకూడదు, వినిపించకూడదంటూ ఆంక్షలు పెట్టి 24 గంటలు కూడా గడవలేదు. అంతలోనే ఆప్ఘన్ టీవీల్లో నేరుగా దర్శనమిచ్చిన తాలిబన్ ఫైటర్లు ప్రజలకు ఓ కీలకమైన హామీని ఇచ్చారు. అదీ టీవీ యాంకర్ ను చుట్టుముట్టి తమ సందేశాన్ని నేరుగా ఆయనతోనే చెప్పించడం విశేషం.

 తాలిబన్ల పాలనలో విచిత్రాలు

తాలిబన్ల పాలనలో విచిత్రాలు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభమైన నేపథ్యంలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతా ఊహిస్తున్నట్లుగానే మహిళల హక్కుల్ని కాలరాయడం ఇప్పటికే ప్రారంభం కాగా.. ఇక మిగతా ఘటనలు కూడా ఒక్కొక్కటిగా వేగంగా జరిగిపోతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీవీలు చూస్తున్న ఆప్ఘన్ ప్రజలు ఒకింత షాక్ కు గురయ్యారు. ఈ ఘటన నుంచి కాసేపటికే తేరుకుని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.

 ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు

ఆప్ఘన్ టీవీ తెరపై తాలిబన్లు

ఆప్ఘన్ టీవీలో నిన్న ఓ రాజకీయ చర్చ జరుగుతోంది. దేశంలో శాంతిని నెలకొల్పే మార్గాలపై ఆప్ఘన్ టీవీ ఏర్పాటు చేసిన చర్చ అది. యాంకర్ యథాలాపంగా చర్చ మొదలుపెట్టాడు. అంతలోనే తాలిబన్లు ఆ టీవీ ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించారు. అంతటితో ఆగకుండా టీవీ లైవ్ ప్రసారం అవుతున్న స్టూడియాలోకి వెళ్లిపోయారు. అయుధాల్ని పట్టుకుని అలాగే స్టూడియోలోకి వెళ్లిన తాలిబన్ ఫైటర్లు సదరు యాంకర్ కు వెనుక నిలబడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యాంకర్ గజగజా వణికిపోయాడు. తాలిబన్ ఫైటర్లు తనను చంపేస్తారేమోనని భయపడ్డాడు. అసలే దేశంలో పరిస్ఝితులు బాగోలేవు. అదీ టీవీ ఛానళ్ల ప్రసారాలపై తాలిబన్లు ఆంక్షలు విధిస్తున్న సందర్భం. ఏం జరుగుతుందో తెలియక కాసేపు గందరగోళానికి గురయ్యాడు.

టీవీల్లో తాలిబన్లను చూసి వీక్షకుల షాక్

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు టీవీల ద్వారా తెలుసుకుంటున్న అక్కడి ప్రజలు.. నిన్న కూడా ఎప్పటిలాగే టీవీలు ఆన్ చేశారు. అంతే వారికి కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యారు. ఏకంగా ఎనిమిది మంది తాలిబన్ ఫైటర్లు తమ అభిమాన టీవీ యాంకర్ ను చుట్టుముట్టేసి ఉన్నారు. వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క ఆయుధం గురితప్పినా టీవీ యాంకర్ కు చావు ముూడినట్లే. దీంతో వీక్షకులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాసేపటికే తేరుకుని ఏం చెప్తారో చూద్దామని ఆసక్తిగా టీవీకి అతుక్కుపోయారు.

టీవీ యాంకర్ ఏం చెప్పాడో తెలుసా ?

తాలిబన్ ఫైటర్లు తనను చుట్టుముట్టిన వేళ తొలుత భయాందోళనకు గురైన ఆప్ఘన్ టీవీ యాంకర్ కాసేపటికే తేరుకున్నాడు. తాలిబన్ ఫైటర్లు అతనికి ఓ విషయం చెప్పారు. దాన్ని యథాతథంగా వీక్షకులకు చెప్పమని ఆదేశించారు. అంతే మరో మాట లేకుండా తాలిబన్ల సందేశాన్ని చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఆప్ఘనిస్దాన్ ను ఆక్రమించిన తర్వాత తాలిబన్లు పెట్టిన ఇస్లామిక్ ఎమిరేట్స్ పేరుతో మొదలుపెట్టిన యాంకర్ వారి సందేశాన్ని యథాతథంగా వీక్షకులకు చెప్పేశాడు. అంతే వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు తికమక పడ్డారు.

 ఆప్ఘన్ ప్రజలకు తాలిబన్ల భరోసా

ఆప్ఘన్ ప్రజలకు తాలిబన్ల భరోసా

ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్ధితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తాలిబన్లు ఎప్పుడు వచ్చి తమపై దాడువు చేస్తారో తెలియక భయపడుతున్నారు. ముందుగా వీరిలో విశ్వాసం నింపితే కానీ అంతర్జాతీయంగా తమకు మద్దతు దొరకదని భావిస్తున్న తాలిబన్లు తమ సందేశాన్ని సదరు ఆప్ఘన్ టీవీ యాంకర్ ద్వారా చెప్పించాలనుకున్నారు. దీంతో టీవీ యాంకర్ కూడా ప్రజలు ఇలా వారి సందేశాన్ని వినిపించాడు. " ఇస్లామిక్ ఎమిరేట్ ప్రజల్ని భయపడొద్దని, తమకు సహకరించమని కోరుతోంది." అని చెప్పి తన వార్తను ముగించాడు. ఆ తర్వాత అక్కడ చర్చలో ఉన్న మిగతా వారందరినీ తరిమేసి ఓ తాలిబన్ ఫైటర్ సదరు యాంకర్ తో చర్చను పష్తూన్ బాషలో కొనసాగించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+